Publish Date:Aug 27, 2024
కాంగ్రెస్ కు బిజెపి బద్ద శత్రువు. ఈ రెండు పార్టీలు మునుపెన్నడూ కల్సి రాలేదు.కానీ హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ కు బిజెపి పూర్తి మద్దత్తు ఇస్తోంది. ఈ రెండు పార్టీల కామన్ బద్దశత్రువు బిఆర్ఎస్ . బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఫామ్ హౌజ్ జన్వాడా కూల్చివేత కోసం కాంగ్రెస్ కు బిజెపి బాసటగా నిల్చింది.
హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలోని ఇతర నాయకులు హైడ్రాపై ఆచితూచి మాట్లాడుతుంటే రఘునందన్ మాత్రం అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సమర్థించిన ఆయన.. ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వం తరపున హైకోర్టులోనూ వాదనలు వినిపించేందుకు సిద్ధమని ప్రకటించి సంచలనమే సృష్టించారు.
తాజాగా, మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అడ్డొచ్చే వారిపై బుల్డోజర్లు ఎక్కించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు, కుంటలు, ఆక్రమణల కూల్చివేతల విషయంలో ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, ఈ విషయంలో హైడ్రా పారద్శకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగని పేదల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధుల్లో రాజకీయ నాయకులు ఎవరూ కలగజేసుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి ప్రభుత్వ భవనాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-is-the-arch-enemy-of-the-congress-25-183716.html
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.