ఇక ఇప్పుడు బీజేపీ దృష్టి బెంగాల్ పై!

Publish Date:Nov 24, 2025

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మహాఘట్ బంధన్ ను మట్టికరిపించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.  దీంతో ఈ సారి గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు  తొలి రెండు విజయాలూ సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ తృణమూల్ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు ఉండేది. అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో తృణమూల్ విజయం నల్లేరుమీద బండి నడకే అయ్యింది. అయితే మూడో సారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి  మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది.  సరే సంపూర్ణ మెజారిటీతోనే తృణమూల్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే అందుకు ప్రధాన కారణం మమతా బెనర్జీయే అని చెప్పాలి.  కమ్యూనిస్టులకు పెట్టని గోడలుగా ఉన్న ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం వారి ప్రాబల్యాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే ఆ స్థానంలో ఆమె పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీకి ఎదగడానికి అవకాశాలు కల్పించినట్లైంది. ఇక ప్రభుత్వ వేధింపుల కారణంగా కమ్యూనిస్టులు చెల్లా చెదురైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదు సమయంలో స్వీయరక్షణ కోసం చాలా వరకూ కమ్యూనిస్టులు కమలం పార్టీ పంచన చేరినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా తెలంగాణలో ఈటల వంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ ను ఎదిరించేందుకు కమలం పార్టీ పంచన చేరిన చందంగానే తృణమూల్ ధాటి నుంచి తమను తాము కాపాడుకుని ఎదిరించేందుకు పశ్చిమ బెంగాల్ లో కూడా కమ్యూనిస్టులు బీజేపీకి చేరువయ్యారని విశ్లేషిస్తున్నారు.   

2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో   కేవలం 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు  2021 అసెంబ్లీలో  38 శాతానికి పెరిగింది.  దీంతో ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. కాగా బీజేపీ ఇప్పుడు కలిసివచ్చే అంశమేంటంటే.. తృణమూల్ అధినేత్రితో విభేదించి కమలం గూటికి చేరిన నేతలే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరంతా మోడీ, అమిత్ షా మార్గదర్శకత్వంలో తృణమూల్ పరాజయం, మమతా బెనర్జీని గద్దెదింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గ్రహించినా మమతా బెనర్జీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లపైనే మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు.  చూడాలి మరి వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ  ఎంత తీవ్రంగా ఉంటుందో.. ఎవరు గెలిచి అధికారపగ్గాలు చేపడతారో?

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.