టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీ-బీఆర్ఎస్ తెరవెనక స్నేహం?

Publish Date:Jul 6, 2023

Advertisement

తెలంగాణలో బీఆర్ఎస్ ,బీజేపీల మధ్య స్నేహం ఉందా?  వైరం ఉందా?  అసలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇదే చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రజలలో కూడా జరుగుతున్న చర్చ. ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో ఉప్పూ నిప్పులా ఉంటారు. రోజూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంటారు. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టులు చేయిస్తే.. ఢిల్లీలో బీజేపీ.. బీఆర్ఎస్ నేతలను కేసులతో పరుగులు పెట్టిస్తుంటుంది. బీజేపీ తెలంగాణలో  జెండా పాతాలని చూస్తుంటే.. బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నది. అయితే ఇదంతా నిజమా?  నిజంగానే ఈ రెండు పార్టీలూ  ప్రత్యర్థులేనా అంటే ఏమో ఇది కూడా ఒకరకమైన రాజకీయమే అని చెప్పుకోక తప్పదు.

గల్లీలో కొట్టుకుంటారు.. ఢిల్లీలో కలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపిస్తుంటారు. ఏమో అది కూడా నిజం ఎందుకు కాకూడదు అని ఇప్పటి రాజకీయాలను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ మాత్రమే. అసలు బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అందుకే బీజేపీ తలపడినా, పోటీపడినా కాంగ్రెస్ తోనే. కనుక బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ మాత్రమే. పోనీ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ శత్రువే కదా అనుకున్నా.. అది బీఆర్ఎస్ అధికారాన్ని బీజేపీ లాక్కొనే స్థాయి శత్రుత్వం కాదు. ఆ మాట కొస్తే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కాలంటే ఆషామాషీ కాదు. అది బీజేపీ పెద్దలకు సైతం తెలుసు. ఇక తెలంగాణలో ఏదైనా అవకాశం ఉందంటే అది కాంగ్రెస్ కు మాత్రమే. రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీగా.. గల్లీ నుండి నిర్మాణాత్మకమైన క్యాడర్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ కు ఆ అవకాశం ఉంది. ఉంటుంది కూడా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీజేపీకి ఉమ్మడి శత్రువును చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే అటు కేంద్రంలో బీజేపీకి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ముప్పు. ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో చేరిన కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా కాంగ్రెస్ వశమైతే బీజేపీకి అది తట్టుకోలేని ఎదురు దెబ్బగా మారుతుంది. దేశ వ్యాప్తంగా ఇది బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక, తెలంగాణలో బీజేపీకి అధికారం ఎలాగూ దక్కదు.. కనుక తాను బలపడకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు ఇటీవలి పరిణామాలను ఉటంకిస్తూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే  కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు తెరవెనక మిత్రులుగా మారారన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. పైకి బీజేపీ వెర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కనిపిస్తూ కాంగ్రెస్ ను తగ్గించడం అన్నదే ఈ రెండు పార్టీల వ్యూహంగా చెబుతున్నారు. 

ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటలను అద్యక్షుడిని చేస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. దీనికి కారణం ఈటల బీఆర్ఎస్ పార్టీకి శత్రువు కావడమే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.  బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహం ఈటల అధ్యక్షుడిగా ఉంటే సాగదు. అందుకే సౌమ్యుడు, తొలి నుండి బీజేపీ అధిష్టానికి చేరువగా ఉండే  కిషన్ రెడ్డిని ఈ ప్రణాళిక కోసం ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంప గుత్తగా కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విజయానికి బాటలు పరచడమే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్లాన్ గా కనిపిస్తున్నదని.. మరోవైపు అదే మాదిరిగా దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు పడకుండా చీల్చే పని బీఆర్ఎస్ తలకెత్తుకున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.