Publish Date:May 28, 2026
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు రాష్ట్రాలకు కొత్త సారథులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు.
రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి, తూర్పు ఢిల్లీ ఎంపీ హర్ష్ మల్హోత్రా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఎంపీగా గెలుపొందిన హర్ష్ మల్హోత్రా.. ప్రస్తుతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రవాణా, రహదారుల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. అలాగే పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేవల్ సింగ్ థిల్లాన్‌కు అప్పగించారు. గతంలో 2012 నుండి 2017 వరకు బర్నాలా నియోజకవర్గం నుండి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన థిల్లాన్, 2022 జూన్ 4న బీజేపీలో చేరారు. శిరోమణి అకాలీదళ్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పంజాబ్‌లో ఒంటరిగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి, థిల్లాన్ అనుభవం, క్షేత్రస్థాయి వ్యూహాలు ఎంతగానో కలిసి రానున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్సురాలిగా సీనియర్ మహిళా నాయకురాలు డాక్టర్ అర్చనా గుప్తాను కమలం అధిష్ఠానం నియమించింది.
ఇక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రాయ్‌ను ఎంపిక చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాతాబారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అభిషేక్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును మరింత బిగించడానికి కృషి చేయనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-appoints-new-presidents-39-221134.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.