బీజేపీతో టచ్ లోనే నితీష్ కుమార్.. పీకే సంచలన వ్యాఖ్యలు

Publish Date:Oct 20, 2022

Advertisement

నితీష్ కుమార్ మళ్లీ కమలం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఆయన పదవీ దాహంతీర్చుకోవడానికి మరోసారి కమలానికి స్నేహహస్తం చాస్తారా? అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఔననే అంటున్నారు. పీకే గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు)లో కీలక పాత్ర పోషించారు.  నితీష్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇదంతా 2020కి ముందు.. పీకే జనతాదళ్( యు) నుంచి ఉద్వాసనకు గురికావడానికి ముందు. ఇప్పుడు కాదు.

అటువంటి పీకే తాజాగా నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, కాషాయ శిబిరంతో మరోసారి పొత్తుకు ప్రయత్నిస్తున్నారనీ, ఎన్డీయే గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారనీ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడితో కలిసి మహాఘట్‌బంధన్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారం భంలో జేడీయూ బిజెపితో సంబంధాలను తెంచుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి విదితమే.

అయితే  బీహార్‌లో పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్  పిటిఐతో మాట్లాడుతూ, నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూట మిని చురుకుగా నిర్మిస్తున్నారని భావిస్తున్న ప్రజలు ఆయన బీజేపీతో మరోసారి పొత్తుకు తలుపులు తెరిచే ఉంచారని తెలిస్తే ఆశ్చర్య పోతారని, అయితే అది వాస్తవమని పేర్కొన్నారు.  నితీష్ కుమార్ జేడీయూ  పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ జీ ద్వారా బీజేపీతో నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

జేడీయు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ,   రాజ్యసభ పదవికి   హరివంశ్‌ ఇంత వరకూ రాజీనామా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆర్జేడీతో ఇబ్బందులు వస్తే మళ్లీ కమలంతో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నితీష్ ఒక్క నిముషం కూడా ఆలోచించరనీ, రాజకీయాలలో విలువల కంటే అధికారమే ముఖ్యమని నితీష్ భావిస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా రాజ్యసభ పదవికి తాను రాజీనామా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు హరివంశ్ నిరాకరించారు. కాగా నితీష్ వ్యాఖ్యలను జేడీయూ నిర్ద్వంద్వంగా ఖండించింది. నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపే ప్రశక్తి లేదని జేడీయూ స్పష్టం చేసింది. పీకే వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ అధికార ప్రతినిథి కేసీ త్యాగి
 బీహార్ సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో  బీజేపీతో చేతు కలిపే ప్రశక్తే లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. ఆయన మాటలను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ గత ఆరు నెలలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారనీ, ఆయనకు ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో  గందరగోళాన్ని వ్యాప్తి చేసి లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని త్యాగి విమర్శించారు. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.