అయ్య బాబోయ్ ఈ పిజ్జా తినడానికేనా?
Publish Date:Jan 22, 2023
Advertisement
రికార్డుల యావతో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని ఒక పిచ్చ ఇప్పడు ట్రెండింగ్ లో ఉంది. అదిగా అలాంటి పిచ్చితోనే లాస్ఏంజిల్స్ లోని ఓ పిజ్జా హిట్ ప్రపంచంలోకే అతి పెద్ద పిజ్జా తయారు చేసింది. ఆ పిజ్జా హట్ లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే అతి పెద్ద పిజ్టా తయారీదారుగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇంతకీ ఆ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న పిజ్జా విస్తీర్ణం ఏం రేంజ్ లో ఉందో తెలుసా? అది ఏకంగా 13 వేల 99 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక దీనిని తయారు చేయడానికి 6 వేల 183 కిలోల పిండి వాడారు. అంతేనా 3990 కిలోల జున్ను వాడారు. ఇప్పుడీ పిజ్జాయే ఫుడ్డీల హాట్ టాపిక్. అసలీ పిజ్జా తినడానికేనా అంటే నెటిజన్లు జోకులేస్తున్నారు. ఏది ఏమైనా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ పిజ్జాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/biggest-pizza-25-150358.html





