ఆంధ్రప్రదేశ్ ఐటీ మంద్రి నారా లోకేష్ మంగళవారం (ఫిబ్రవరి 4) ఢిల్లీ వెళ్ళారు. ఆయన పర్యటన వెనుక పెద్ద టాస్కే ఉంది. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. లోకేష్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం కేంద్ర మంత్రితో భేటీ అవుతారు. మళ్లీ అదే రాత్రి తిరిగి అమరావతి చేరుకుంటారు.
ఈ భేటీ అజెండా ఏమిటి? ఇంత హఠాత్తుగా హడావుడిగా ఆయన కేంద్ర మంత్రితో భేటీ అవ్వడానికి కారణమేంటి? ఈ పర్యటనలో ఆయన సాధించుకు వచ్చేదేమిటి? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదేదో ఆషామాషీ భేటీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నది. మరీ ముఖ్యంగా వైజాగ్ ను ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలన్నది లోకేష్ లక్ష్యం. ఇందులో భాగంగానే విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుపైనే లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించనున్నట్లు సమాచారం. ఏఐ యూనివర్సిటీకి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించే ఉద్దేశంలో ఉంది. ఈ ఎక్సలెన్స్ సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తారు. ఇందుకోసం విశాఖలో డేటా సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కోరేం దుకే నారా లోకేష్ కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు సమాచారం. వైజాగ్‌ను టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చాలన్న లోకేష్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రితో నారా లోకేష్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/big-task-behind-lokesh-delhi-tour-39-192356.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.