సైకిలెక్కిన భూమన..విషయమేంటంటే?

Publish Date:May 16, 2026

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం  మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సైకిలెక్కారు. తిరుపతి నగరంలో ఆయన సైకిల్ పై తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు.  పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి  భూమన  తిరుపతి నగర వీధుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు  సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అయ్యాయి. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా  అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాని పిలుపునిచ్చిన వెంటనే కాకుండా..   రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇంధన పొదుపు కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత భూమన  సైకిల్ ప్రయాణం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం  స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ గుర్తుపై ప్రయాణించినప్పటికీ, ఇంధన పొదుపు అనే మంచి ఆశయం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన అనుచరులు సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంటే భూమన  సైకిల్ ప్రయాణానికి సంబంధించిన వార్తా కథనాలను వైసీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని భూమన ఈ సందర్భంగా సూచించారు.

ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రకరకాలుగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంధన పొదుపు కోసం బైక్ ఉపయోగించగా, బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతి శుక్రవారం కాలినడకన సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  స్కూటీపై ప్రయాణించారు.  

By
en-us Political News

  
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. 
ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.