బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు!
Publish Date:Oct 11, 2024
Advertisement
కృష్ణా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంలో బెజవాడ కనకదుర్గమ్మ జలవిహారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు శనివారం (అక్టోబర్ 12)తో ముగుస్తాయి. ఆ సందర్భంగా దుర్గమ్మవారు హంసవాహనంపై కృష్ణా నదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ఆ జలవిహారాన్ని ప్రభుత్వం నదిలో వరద పోటు కారణంగా రద్దు చేసింది. ప్రతి ఏటా విజయ దశమి రోజున బెజవాడ కనకదుర్గమ్మను రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కృష్ణానదిలో తెప్పోత్సవం, హంసవాహన సేవ నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అయితే కృష్ణానదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఈ ఏడాది తెప్పోత్సవం రద్దైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bezawada-kanakadurgamma-teppostavam-cancil-25-186691.html
http://www.teluguone.com/news/content/bezawada-kanakadurgamma-teppostavam-cancil-25-186691.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





