తెలంగాణ ఎన్నికలు.. బెట్టింగుల జోరు!

Publish Date:Nov 29, 2023

Advertisement

తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా...  బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.  
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో రెగ్యులర్ గా భాగం పంచుకుంటున్నారని అంచనా.  ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక  పేర్కొంది.   టీసీఎఫ్ నివేదిక ప్రకారం  బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించే 75 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్ సైట్లన్నీ ఇండియా యూజర్లనే టార్గెట్ చేసుకుంటున్నాయి. 

పాపులర్ బాలీవుడ్ యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారు.   హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బు చేతులు మారుతోంది. క్రికెట్ వరల్డ్ కప్  నేప‌థ్యంలో ప్రారంభ‌మైన‌ ఇల్లీగల్ బెట్టింగ్ దేశంలో ఊపందుకుందనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు  బెట్టింగ్ చేస్తున్నారట‌.  ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల (100 బిలియన్ డాలర్లు)  దాకా ఉంటుందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 

ఇటీవ‌లే క్రికెట్ పండ‌గ అయిపోయింది. ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయన్నది టీసీఎఫ్ అంచనా. ప్ర‌స్తుతం.... ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.  తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా.   

గెలిచేది ఎవరు.. కేసీఆర్ సీఎం అవుతారా?  కాంగ్రెస్ గెలుస్తుందా.. రేవంత్ ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చే ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా సాగుతోంది.  ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండటం.  గత ఎన్నికలకు భిన్నంగా పొత్తు ఈక్వేషన్స్ ఉండటంతో.. మరింత ఆసక్తి రేపుతోంది.   ఈ బెట్టింగ్ గొడ‌వ అంతా తెలంగాణాలో కొన‌సాగుతున్నదంటే పెద్ద విష‌యం ఏమీ కాదు కానీ ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగటం విశేషం. 

గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై  ఏపీలో బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.  అందుకు కారణం లేకపోలేదు.  కాంగ్రెస్ పార్టీకి,.... టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలవడం ఒక కారణమైతే..  రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం.  ఏపీ తెలుగుదేశం అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు. 

తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలోనూ బెట్టింగ్ జోరు మొదలయ్యింది.. బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు..  పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ పెరుగుతోంది.  ఈ బెట్టింగ్ బిజినెస్‌ సుమారుగా 3 వేల కోట్ల రూపాయ‌ల నుండి 5 వేల కోట్ల రూపాయల వరకు  ఉండే అవకాశం ఉందని సమాచారం.. బెట్టింగ్‌లలో  తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది?  నెక్స్ట్ సీఎం ఎవరు..? నియోజకవర్గ స్థాయిలో ఎవరు గెలుస్తారు..?  వివిధ రకాలుగా బెట్టింగులు పెడుతున్నారు నిర్వాహకులi.

క్రికెట్ లో బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగినట్లు..  తెలంగాణ పొలిటికల్ ఫీవర్.... ఇప్పుడు బెట్టింగ్స్ లోనూ మంట పుట్టిస్తున్నది. ఎన్నికల ఫలితాలపై పందేలు కొన‌సాగుతున్నాయి..  విచ్చ‌ల‌విడిగా కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎక్కువ ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు పెడుతున్నారు…అరికపూడి గాంధీ గెలుస్తారా? ఒడిపోతారా?.. అని ఎక్కువ స్థాయి లో డబ్బులు పెడుతున్నట్టుగా సమాచారం..  ఇక అనుకూలంగా ఉన్న వ్యక్తులు గెలుస్తారంటూ ఎవరికివారు పందాలకు దిగుతున్నారు. ఈ విధంగా నాయ‌కుల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు… మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. 

ఇక జిల్లాల వారిగా కొడంగల్, దుబ్బాక, కామారెడ్డి…ప్రాంతాలపై మరింత బెట్టింగ్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. దీంతో తెలంగాణ పోలింగ్ సమయం దగ్గర పడడంతో కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది.   బెట్టింగ్ వ్యాపారం బుకింగ్ జోరుగానే సాగుతోంది.   మొత్తం స్టేట్ లెవెల్‌లో చూస్తే కాంగ్రెస్ వైపు రూపాయి పెడితే, రూపాయి 40 పైసలు నడుస్తోంది. బీఆర్ఎస్ వైపు మాత్రం రూపాయికి,  కేవ‌లం 60 పైసలు నడుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది. 

ప్ర‌త్యేకించి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం గురించి అయితే ..... ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు.  ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది.  బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది.   ఇదే సమయంలో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు.. ఒకటి గజ్వేల్, ఒకటి కామారెడ్డి.. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా లేక ఒక చోట గెలుస్తారా?. ఒకే స్థానంలో విజయం సాధిస్తే అది గజ్వేలా? కామారెడ్డా? ఓడిపోయే సీటు ఏది?  అన్న అంశంపైనా   బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 

హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి.   పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుంద‌ట‌. పోలింగ్ ముగిసి  ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత  ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి. ఎ 
నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతుండటం,  డిసెంబర్ 3 న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటం తో బెట్టింగ్ రాయుళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. 

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.