చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
Publish Date:Jan 12, 2026
Advertisement
శీతాకాలంలో ఆరోగ్యకరమైన లడ్డులు తినడం ఒక ట్రెండ్. కానీ చాలామంది మొదట రుచికి, తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే లడ్డులు తయారుచేసినప్పుడల్లా రుచి కంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాటిని తింటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో నువ్వులు, అవిసె గిండలతో చేసిన లడ్డులు రోజుకు ఒక చిన్న లడ్డూ సరిపోతుంది. దీని కంటే ఎక్కువ అవసరం లేదు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తినడం మంచిది. సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు. రాత్రిపూట వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వాటిని తినకుండా ఉండటం మంచిది. ఒకే రకమైన లడ్డూ తినడం కంటే.. 3-4 రకాల లడ్డూలను తయారు చేసి, ఒక్కొక్క సారి ఒక్కొక్కటి తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైనవి. చాలామంది అన్ని రకాల విత్తనాలు కలిపి లడ్డులు చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ లడ్డులను తీసుకునేటప్పుడు పాలు తాగాల్సిన అవసరం లేదు. లడ్డులు సులభంగా జీర్ణమైతేనే తీసుకోవాలి. వాటిని తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చినా, గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చినా వాటిని తీసుకోకపోవడం మేలు. పిల్లలు, వృద్ధులు నువ్వులు, అవిసె గింజలతో చేసిన లడ్డులను తినకూడదు. ఎందుకంటే వారిలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రకమైన లడ్డులు తినకూడదు. ఈ తప్పులు చేయకూడదు.. లడ్డులను కట్టడానికి పెద్ద మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల లడ్డు ఆరోగ్యంగా మారుతుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చనుకుంటారు. కానీ చక్కెర స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లడ్డులను తినడం మంచిది కాదు. తీవ్రమైన కాలేయం, మూత్రపిండాల రోగులు ఈ లడ్డులను వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండానే తీసుకోకూడదు. ఈ లడ్డులను స్నాక్స్ గా చిరుతిండిగా తీసుకుంటారు. కానీ వీటిని స్నాక్స్ పేరుతో ఎక్కువ తినడం కంటే ఇవి శరీరానికి ఒక మంచి మెడిసిన్ అనుకుని తీసుకుంటే మంచిది. లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయటి లడ్డుల తయారీలో కల్తీ పదార్ధాలు వాడే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఈ లడ్డులు తయారు చేసేటప్పుడు పాలను కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి పాలను వాడకపోవడం మంచిది. *రూపశ్రీ. గమనిక:
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది. దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్ వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరం వెచ్చగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు, అవిసె గింజలు తినడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది వీటిని లడ్డులుగా చేసుకుని తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం, పోషకాలతో మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా పరిగణింపబడతాయి. అయితే ఈ లడ్డులను తయారు చేసుకుని తినేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు ఆహార నిపుణులు. నువ్వులు, అవిసె గింజలు లాంటి పదార్థాలను తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. లేకపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/best-seeds-to-eat-in-winter-for-immunity-34-212404.html




