బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: స్టార్టప్ ఫౌండర్ వైరల్ పోస్ట్!

Publish Date:Aug 21, 2026

Advertisement

భారతదేశ ఐటీ రాజధానిగా ఎంతో పేరుగాంచిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ మరీ దారుణంగా తయారవుతున్నాయి. అక్కడ కొత్తగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చినా, అనేక ఫ్లైఓవర్లు నిర్మించినా కూడా రోడ్లపై వాహనాల రద్దీ మత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ ఘోరమైన ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ నగరంలో ప్రతిరోజూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన ప్రయాణ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన తన కంపెనీ ఆఫీసులో ఉద్యోగులు లేక ఖాళీగా ఉన్న డెస్క్‌ల ఫొటోను షేర్ చేస్తూ రాసుకొచ్చిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.

తన లింక్డ్‌ఇన్ ఖాతాలో బాల పన్నీర్ సెల్వం షేర్ చేసిన పోస్ట్‌లో ఆసక్తికరమైన అలాగే నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేశారు. "మా ఆఫీసులో సమస్య ఉద్యోగుల పనితీరులో లేదా వారి వైఖరిలో లేదు, వారు సమయానికి ఆఫీసుకు చేరుకోవడంలోనే అసలైన సమస్య ఉంది" అని ఆయన ఎంతో స్పష్టంగా పేర్కొన్నారు. సిటీలో ప్రతిరోజూ చిన్న చిన్న దూరాలు చేరుకోవడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఒక స్కూటీపై కేవలం 4 కిలోమీటర్ల దూరం వెళ్లడానికే దాదాపు 20 నిమిషాల సమయం పడుతోందని తెలిపారు. ఒకవేళ టూవీలర్ కాకుండా కారులో గనుక బయలుదేరితే ఈ సమయం మరింత పెరిగిపోతుందని వివరించారు.

పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించడమే ఒక పెద్ద యుద్ధంలా మారుతోందని ఆయన ఆందోళన చెందారు. ఇలా ప్రతిరోజూ ఉదయమే రోడ్లపై నరకం చూసి ఆఫీసుకు చేరుకునేసరికి ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోతున్నారని చెప్పారు. అలా అలసిపోయిన మానసిక స్థితితో ఆఫీస్‌కు వచ్చి ఉద్యోగులు ఇక ఏం పని చేయగలరని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు లేని సాధారణ రోజున సాయంత్రం 4 గంటల సమయంలో వైట్‌ఫీల్డ్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ వరకు ఉన్న 17 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి తనకు ఏకంగా 2 గంటల సమయం పట్టిందని తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. సాయంత్రం 4 గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరితే ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతమని పేర్కొన్నారు.

 

 

 

bengaluru it employees traffic issues viral news,applied ai studio founder bengaluru traffic post.

By
en-us Political News

  
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.