మమతకు మరో ఎదురు దెబ్బ
Publish Date:Jul 8, 2021
Advertisement
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసి రావడం లేదో లేక ఆమే కాలానికి ఎదురీతున్నారో ఏమో గానీ, కష్టాలు క్యూ కట్టి ఆమెను వెంటాడుతున్నాయి. ఓ వంక అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోజరిగిన హింస. ఆమెమెడకు చుట్టుకుంటోంది. సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం జరుపుతున్న విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో అనే భయం మమతను,ఆమె ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మానవ హక్కుల సంఘం విచారణను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నికల అనంతర హింస పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై, వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరింది. అయితే అందుకు కలకత్తా హై కోర్టు, నో అనేసింది. కలకత్తా హై కోర్టు ఆదేశాలపై మమత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడా ఆమెకు చుక్కెదురైంది.ఈ నేపధ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా విచారణ మిటీని ఏర్పాటు చేశారు. అయితే, కమిటీ విచారణను అడ్డుకోవడమే కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కమిటి సభ్యులపై కూడా భౌతిక దాడులకు పాల్పడ్డడ్డారు.ఇందుకు సమబందించిన ఫోటోలు, వీడియో ఆధారాలను కమిషన్ సేకరించినట్లు సమాచారం. బుధవారం కలకత్తా హై కోర్టు మమతకు మరో షాకిచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్’లో ఓటమి చవిచూసిన ఆమె, తమ ప్రత్యర్ధి, బీజీపీ అభ్యర్ధి సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ, కలకత్తా హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతవరకు అయితే కొంత బాగానే వుంది.కానీ, ఆమె మమత కదా, అంతటితో ఆగలేదు, ఆమె పిటీషన్’పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ, కేసు విచారణ మరో బెంచికి మార్చలాని కోరారు. ఆ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు... న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ తీవ్రంగా హెచ్చరించింది. అంతే కాదు, హై కోర్టు ఆమెకు రూ.5లక్షల జరిమానా విధించింది. ఇదలా ఉంటే అసలు ఆమె పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికలలో ఒడి పోయిన ఆమె ఆరు నెలలోగా శాసన సభ లేదా మండలి సభ్యురాలుగా ఎన్నిక కావలసి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఆమె గడువులోగా ఎన్నికయ్యే అవ్క్స్సం కనిపించడం లేదు. సో ... నవంబర్ నాలుగు తర్వాత ఆమె పదవి ఉంటుందో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితికి తోడూ కోర్టు చికాకులు బెంగాల్ పులిని బెంబేలెత్తిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/bengal-cm-mamatha-benarji-shocked-39-119105.html





