ధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!

Publish Date:Feb 16, 2026

Advertisement

ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట.  కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే..

రోగనిరోధక శక్తి..

కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు  కివి పండు నుండే పొందవచ్చు.  విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.  ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం మెండు..

గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు  సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది.  కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది.  ఇది  అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది.

రక్తం గడ్డకట్టే పనికి చెక్..

 సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది.  ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది.  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.  కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

                                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.