బీబీసీ డాక్యుమెంటరీ పై ముదురుతున్న దుమారం

Publish Date:Jan 25, 2023

Advertisement

ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పూర్వం 2002 గుజరాత్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు కథా వస్తువుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను ఇటీవల యూట్యూబ్‌ (ఇండియా)లో బీబీసీ అప్‌లోడ్‌ చేసింది. అయితే అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ధ్వజమెత్తారు.
నిజానికి, ఆ డాక్యుమెంటరీ లో ఏముంది? ఏమి లేదు అనే విషయాన్ని, అలాగే  ఉన్నదంతా నిజమేనా అనే విషయాన్ని పక్కన పెడితే  ఈ డాక్యుమెంటరీ రాజకీయ దుమారాన్ని అయితే సృష్టిస్తోంది. నిజానికి గోద్రా దుర్ఘటన (గుజారత్ అల్లర్లకు అగ్గిరాజేసిన 59 మంది కరసేవకుల సజీవ దహనం సంఘటన) నేపధ్యంగా జరిగిన గుజరాత్ లో అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని మాత్రమే కాదు  ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్ లను  సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని ప్రభుత్వం నిషేధ  ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సహజంగానే  హిందూ వ్యతిరేక లౌకికవాద వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంతే కాదు నిషేధం ఉన్నా ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఆసక్తి చూపడం కాదు  ప్రభుత ఉత్తర్వులను ధిక్కరించి అయినా, ప్రదర్శించి తీరుతామని  కొన్ని వామపక్ష అనుబంధ విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి.
మరోవంక ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్  తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా అనేక పార్టీలు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలనే డిమాండ్ తో గొంతు కలుపుతున్నాయి. కేరళ రాష్ట్ర పీసీసీ మైనారిటీ సెల్ మరో అడుగు ముందుకేసి, గణతంత్ర దినోత్సవం    ( జనవరి 26) ఆ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించింది.  
డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.  డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది.. ఇది కేంద్రంపై మా (మైనారిటీ) నిరసన  అని కేపీసీసీ అడ్వకేట్ షహాబుద్దీన్ అన్నారు. ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి ఏది నిజమో ఏది కాదో  ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
 ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఎలా అడ్డుకుంటుంది ? ఏది తప్పు ఏది కాదో ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోనివ్వండి. అల్లర్లలో వేలాది మంది మరణించిన గుజరాత్‌కు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఎలా విశ్వసిస్తాము  అని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ అన్నారు. ఈ అంశంపై బీజేపీకి చెందిన టామ్ వడక్కన్ స్పందిస్తూ..  ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్ర అని అన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన అన్నారు. 
ఇదిలా వుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్ యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది.
ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రెండు రోజుల కిందట స్పందించారు. భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలస రాజ్యాల మత్తు నుండి  బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు.అయితే ఎన్నికల సంవత్సరంలో బీబీసీ సృష్టించిన వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న భయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.