సైబర్ నేరాల నియంత్రణ... బ్యాంకుల పాత్రే క్రియాశీలం

Publish Date:Nov 24, 2024

Advertisement

దేశంలో  సైబర్ క్రైమ్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ నకరం. అయితే ఈ తరహా క్రైమ్ ల నిరోధంలో బ్యాంకులు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే  వీటిని చాలా వరకూ నిరోధించవచ్చని ఇటీవల  ఏపీలోని తిరువూరు, తెలంగాణ లోని మహబూబ్ నగర్ లలో జరిగిన ఉందంతాలు రుజువు చేశాయి.  

ఇటువంటి సైబర్ క్రైమ్ లను దాదాపు 90 శాతం వరకూ బ్యాంకులలోనే నివారించే అవకాశాలు ఉన్నా యని సైబర్ పోలీసులు చెబుతున్నారు.   బ్యాంకులు ఖాతా దారులకు ఇచ్చిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే  బ్యాంకులకు ఖాతా దారులను రక్షించే నైతిక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.  తిరువూరు,మహబూబ్ నగర్ లలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో  60లక్షల రూపాయల సైబర్ క్రైమ్ మనీ ట్రాన్స్ఫర్ ఆపగలిగారు. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే ఖాతాదారులను సైబర్ మోసాల నుంచి కాపడటం సులువు అని ఈ ఉందంతం రుజువు చేసింది.  ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో  సైబర్ మోసాల గురించి ప్రస్తావించడమే ఇది ఎంత తీవ్ర ముప్పుగా పరిణమించిందో అర్ధం చేసుకోవచ్చు.  

సైబర్ నేరాలను అరికట్టడంలో సౌదీ అరేబియా మొదటిస్థానంలో ఉంది.ఆ దేశం 2015లో 1.60 లక్షల సైబర్ నేరాలు జరిగినట్లు నమోదైనాయి.నేరాల నియంత్రణలో బహుముఖ వ్యూహం అనుసరించి 100 శాతం విజయం సాధించింది. 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ ని స్థాపించి సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. బడ్జెట్లో నిధులు పెంచడం, విద్యా విధానంలో కోర్సు ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాల సాంకేతికత సహకార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో  సౌదీ అరేబియా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. భారత్ లో కూడా ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సౌదీనీ ప్రమాణికంగా తీసుకుని చర్యలు చేపట్టాలి. అందుకు విశ్వవిద్యాలయాలలో కోర్సులు ప్రవేశపెట్టి, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి.  అలాగే  ఈ సైబర్ సెల్ లను బ్యాంకులతో అనుసంధానం చేయాల్సి. అదే సమయంలో బ్యాంకులూ  అప్రయత్తంగా ఉండి   నేరాలను అరికట్టేందుకు సహకారం అందించాలి.ఇలాంటి చర్యలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే తప్పక  సత్ఫలితాలు వస్తాయి. 

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.