నాలుగు సార్లు టెస్టు చేసినా నెగటివ్.. అయినా ప్రాణాలు పోయాయి

Publish Date:Jul 18, 2020

Advertisement

కరోనా వైరస్ లక్షణాలు పైకి కనిపించిన వారు అనుమానం తో టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే చికిత్స చేయించుకుంటున్నారు. ఐతే లక్షణాలు ఉండి టెస్టుల లో నెగటివ్ వస్తే మాత్రం పరిస్థితి అయోమయం లో పడి చికిత్స ఆలస్యమవడం తో ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. ఇటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల 26 మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో అక్కడే పని చేస్తున్న ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ కూడా కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ రావడంతో తిరిగి విధులకు హాజరయ్యారు. ఐతే కొద్ది రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోవాలని పై అధికారులు సూచించడంతో మళ్ళీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఐతే మళ్లీ నెగిటివ్‌గానే ఫలితం వచ్చింది. 

ఇది ఇలా ఉండగా గడచిన కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో అయన బాధపడుతున్నాడు. దీంతో మరో సారి ఆ ఏఎస్ఐ కరోనా పరీక్షలు చేయించుకోగా మళ్లీ రిజల్ట్ నెగిటివ్‌గానే వచ్చింది. మొత్తం నాలుగు సార్లు పరీక్షలు చేయించుకోగా.. నాలుగు సార్లు నెగిటివ్‌ ఫలితమే వచ్చింది. కానీ అయన పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు నగరంలోని పలు ఆసుపత్రులలో చేర్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బెడ్ లు ఖాళీ లేవంటూ ప్రేమ్ కుమార్‌ను చేర్చుకోలేదు.

ఆయనకు అంతకు ముందు చేసిన కరోనా టెస్టులన్నింటిలో నెగిటివ్ ఫలితం రావడంతో చివరికి గాంధీ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు చిరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగలిగారు. ఐతే అప్పటికే ఆ ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇక్కడ కూడా మరోసారి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష జరపగా అక్కడ కూడా నెగిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆ మరుసటి రోజుకు ప్రేమ్ కుమార్ కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో డాక్టర్లు మళ్లీ కరోనా పరీక్షలు చేశారు కానీ ఆ రిజల్ట్ వచ్చేలోపే ప్రేమ్ కుమార్ ప్రాణాలు విడిచారు. అయన మరణం తరువాత వచ్చిన టెస్ట్ ఫలితంలో మాత్రం పాజిటివ్ ‌గా తేలింది. దీంతో ముందుగా చేయించుకున్న నాలుగు టెస్టులలో నెగిటివ్ రావడమే ఆ ఏఎస్ఐ మ‌ృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.