చంద్రబాబు కోసం తొడకొట్టి ముందుకొచ్చిన బాలయ్య

Publish Date:Sep 12, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డని ఓటమి భయం వెంతడుతోందా? ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్, మరో వంక చంద్రబాబు నాయుడు..ముగ్గురూ మూడు దిక్కుల నుంచి ఒకే సారి సమర శంఖం పూరించడంతో  జగన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?  ఇటు చూస్తే విరుచుకు పడుతున్న విపక్షాలు, అటు చూస్తే పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, మరో వంక వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలు క్రింది స్థాయి నాయకులవరకు అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయ పెడుతోందా?  విజయంపై నమ్మకం పూర్తిగా పోయిందా అంటే  రాజకీయ విశ్లేషుకులు అవుననే  అంటున్నారు. 

అందుకే ఎటూ పాలుపోని ఏమి చేయాలో, ఎలా బయట పడాలో అర్థం కాని  జగన్ రెడ్డి తాచెడ్డ  కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా  ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోయి, ఎన్నో అవినీతి కేసుల్లో  ఏవన్  ముద్దాయిగా ఉండడమే కాకుండా, బెయిల్  మీద కాలం వెళ్ళదీస్తూ  కోర్టు అనుమతి లేనిదే దేశం గీత దాట లేని  ఏవన్  జగన్ రెడ్డి అందరూ తనలాగే, వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ఏమో కానీ, రాజకీయ ప్రత్యర్ధులందరినీ, అదే గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే, ఇప్పడు చంద్రబాబు నాయుడు పై కక్ష కట్టి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే  నాలుగు పదుల పైబడిన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్’ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు.  జైలుకు పంపారు.   

అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము  అన్నట్లుగా  చంద్రబాబు నాయుడిని నిర్బందించినంత మాత్రాన తెలుగు దేశం ప్రభంజనాన్ని, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోగల మనుకుంటే, అది జగన్ రెడ్డి, ఆయనగారి  పాపాల పరివారం  అజ్ఞానం, అవివేకం,   అహంకారమే అవుతుంది. ఒక్క చంద్రబాబును నిర్బందిస్తే, న్యాయం కోసం , ధర్మం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం వంద మంది చంద్రబాబులు పుట్టు కొస్తారు.  కాదు.. కాదు పుట్టు కొచ్చారు. నిజం. సినిమాల్లోనే కాదు, రాజకీయ జీవితంలోనూ ప్రత్యర్ధులను దబిడిదిబిడి ఆడించే  బాలయ్య  మరో మారు తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన క్యాడర్ ను తిరిగి ఛార్జ్  చేసేందుకు బాలయ్య బాబు రె ఢీ  అయ్యారు.  
చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన బాలయ్య కార్యకర్తలు అధైర్య పడవలసిన అవసరం లేదని ... చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని భరోసా ఇచ్చారు. అలాగే, 'నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం' అన్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని..ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు.

నేను వస్తున్నా.. నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ  గతంలో ఎన్టీఆర్ సర్కార్ ను అప్రజాస్వామికంగా కూలదోసినప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా తెలుగోడి సత్తా చూపాం. ఇప్పడు ఆ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరోమారు ఆనాటి పౌరుషాన్ని, పౌరుషాగ్నిని చూపుదాం అని పిలుపునిచ్చారు.   జగన్‌ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్న బాలయ్య, ఈ నాలుగున్నరేళ్లు అనుభవించిన నరకయాతన చాలు ఇక మార్పు  మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను అన్నారు. భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుందన్నారు. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.

అంతే కాదు  అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్‌ నేమ్  గా నిలిచిన చంద్రబాబును, అరాచకానికి ప్రతిరూపంగా నిలిచే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కక్షసాధింపే లక్ష్యంగా అరెస్ట్ చేశారని బాలయ్య అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య అన్నారు .స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష సాధింపుతోనే కుట్రపన్ని అరెస్టు చేశారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గతంలోనూ ఎన్నో సంక్షోభాలు చూసింది.. అధిగమించింది ఇప్పుడూ, ఓటమి భయంతో, కక్షపూరితంగా జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని  అధిగమిస్తామంటూ బాలయ్య గర్జించారు.  

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.