ఆ ఉంగరం.. చంద్రబాబు ఆరోగ్య మీటర్
Publish Date:Jul 8, 2022
Advertisement
ఆ మధ్య మా వూరికి ఓ పెద్ద సాములోరు వచ్చారు. మెడలో రుద్రాక్షలు, రెండుచేతి వేళ్లకీ ఉంగరాలు అట్ట హాసంగా వున్నారు. భయం భయంగానే దణ్ణం పెట్టేరు. చేతివేళ్లకి అలా నిండుగా బంగారం, వెండి మరేదో ఉంగరాలు ధరించినవారు ఇటీవలి కాలంలో చాలామందే దర్శనమిస్తారు. రాజకీయనాయకులకు రెండు మూడు ఉంగరాలు తప్పకుండా కనపడతాయి. అస్సలు అటువంటి ఆర్భాటాలేవీ లేని రాజకీయ నాయ కుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడీపీ అధినే నారా చంద్రబాబు నాయుడు. అయితే మొన్నీ మధ్యనే ఆయన ఒక చేతికి ఉంగరం దర్శనమిచ్చింది. అది కూడా ఎడమ చేతి చూపుడు వేలికి పెట్టుకున్నారు. ఇదేమిటీ.. ఈయన చేతికి వాచ్ కూడా వుండదే.. ఇప్పుడు ఉంగరం ధరించారేమిటబ్బా.. అని అందరూ కాస్తంత విస్తుపోయారు. ఈయన కూడా ఉంగరాల మంత్ర తంత్రాల పిచ్చిలోగాని పడ్డారా అన్న అనుమా నాలూ వ్యక్తమయ్యాయి. ఉంగరం ధరించడం గురించి రకరకాల ప్రచారం మొదలైంది. అదేం లేదు మీ రెవ్వరూ అలాంటి సందేహాలు పెట్టుకోవ ద్దు, ఇది నా ఆరోగ్య సూచీతో వున్న ప్లాటినమ్ రింగ్ అని టీడీపీ అధినేత స్వయంగా స్పష్టంచేశారు.
అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లె లో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆ ఉంగరం లాంటి దాని గురించి చెప్పారు. తను పెట్టుకున్నది కేవలం ఉంగరం మాత్రమే కాదు. అందులో ఒక చిప్ వుంది. అది ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పు తెలియజేస్తుందన్నారు. హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందిట. ఈ సమాచారాన్ని ఆయన కంప్యూటర్‌కు పంపుతుందని చంద్రబాబు చెప్పారు. రోజూ ఉదయాన్నే కంప్యూటర్‌లోకి ఈ ప్లాటినం ఉంగరం పంపిన రిపోర్ట్ ను చెక్ చేసుకుంటారట. రోజువారీగా జరగాల్సిన చర్యల్లో ఏది తప్పుగా ఉందనే విషయాన్ని ఈ చిప్ ఇట్టే చెప్పే స్తుందని బాబు అన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలో ఏమన్నా పొరపాట్లు వుంటే గ్రహించి మళ్లీ ఆ లోటు పాటు జరగకుండా అప్రమత్తంగా ఉంటానన్నారు.
http://www.teluguone.com/news/content/babu-ringhealth-metre-39-139308.html





