కేంద్రం పెద్దలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్.. అశోక గజపతి రాజు

Publish Date:Sep 20, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత పి.అశోక్ గజపతి రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ది కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే తాను న్యాయవాది కాకపోయినా.. సుదీర్ఘ కాలం చట్టసభల్లో పని చేసిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది కేబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అది పరిగణలోకి తీసుకోకుండా.. ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకున్నారని ఆయన వివరించారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.    

అశోక్ గజపతి రాజు.. మాటలకు విశ్వసనీయత ఉందని నెటిజన్లు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు. అయినా నిప్పు లేకుండా పొగ రాదంటున్నారు. అదీకాక జగన్ తొలి మలి కేబినెట్లోని పలువురు మంత్రుల్లాగా అశోక్ గజపతి రాజు మాట్లాడరని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇక అశోక్ గజపతి రాజు వ్యవహరశైలినే కాదు.. ఆయనలోని నీతి నిజాయితీని సైతం ప్రధాని మోదీ.. గతంలో ప్రశంసించిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు అశోక్ గజపతి రాజు.. ఆయన రాజకీయ జీవితం.. తెరిచిన పుస్తకమని... ఆయన ప్రజా ప్రతినిధిగా అటు ఢిల్లీలో ఉన్నా.. ఇటు విజయనగరంలో ఉన్నా.. ప్రజలు, వారి సంక్షేమం కోసమే పాటు పడ్డారని జిల్లా వాసులు సైతం చెప్పుకుంటారని నెటిజన్లు చెబుతున్నారు.  

మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై జాతీయ మీడియా విస్తృతంగా కవర్ చేసిందని.. దీంతో ఈ విషయం కేంద్రంలోని పెద్దలకు తెలిసే ఉంటుందని నెటిజన్లు వివరిస్తున్నారు. అదీకాక.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఇంకోవైపు కేంద్రంలోని పెద్దలతో జగన్ ప్రభుత్వంలోని పెద్దలు.. అంటకాగుతున్నారన్నది బహిరంగ రహస్యమేనని  నెటిజన్లు అంటున్నారు. ఎన్నికలు రానున్నాయి.. అలాంటి వేళ.. మాకు మీరు.. మీకు మేము అంటూ.. అటు బీజేపీ, ఇటు వైసీపీలు కలిసి మెలసి ఈ పని చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో మాజీ ఎంపీ మధు యాష్కి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతిని ప్రస్తావిస్తున్నారు.

ఇక చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినా.. పక్క రాష్ట్రాల నేతలు.. విభిన్నరకాల ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారని.. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే.. ఆ వెనుక.. ఉన్నది కేంద్ర ప్రభుత్వమా? లేకుంటే జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఈ అరెస్ట్‌కు పథక రచన చేశారా? అదీ ఇదీ కాకుంటే.. జగన్ ప్రభుత్వంతో కలిసి... కేంద్రం ఈ చర్యకు పూనుకుందా? అనే సందేహాలు  నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  

ఇంకోవైపు జగన్ విదేశీ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ అయితే.. ఏపీ సీఎం స్వదేశానికి వచ్చిన వెంటనే.. ఢిల్లీ పర్యటనకు వెళ్తారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఇప్పటికీ   సీఎం జగన్.. నేటికి ఢిల్లీకి వెళ్లిందీ లేదని.. ఓ వేళ.. జగన్ డిల్లీకి వెళ్లి.. కేంద్రంలోని పెద్దలతో భేటీ అయితే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మరిన్ని రాజకీయ ప్రచారాలు ఊపందుకొంటాయనే ఉద్దేశ్యంతో  కేంద్రం పెద్దలే ఆయనను రానీయలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.