Publish Date:Nov 10, 2025
భారత్ మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదలు తెలిపారు.
ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/azharuddin-36-209267.html
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.