ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు?

Publish Date:Sep 21, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన తీరుగా జరుగుతాయా,  ముందస్తుకు జరుగుతాయా? ఇది ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో  జరుగుతున్న చర్చ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరో మారు జమిలి ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చిన తర్వాత ... ముందస్తు అసెంబ్లీ ఎన్నికల చర్చ మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా,జమిలి బిల్లు తెచ్చేందుకే ప్రత్యేక సమావేశాలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వంక  సెప్టెంబర్ 18న మొదలైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అందరూ అనుకున్నట్లుగానే, కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా బిల్లుతోనే అడుగుపెట్టింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాలు, బిల్లును సమర్దిస్తూనే  చిన్న చిన్న చిక్కులు సృష్టించే ప్రయత్నం చేసినా, కేంద్ర ప్రభుత్వం విపక్షాలు వెనకడుగువేసే ఆవకాశం లేకుండా ముగ్గులోకి దించింది.  బుధవారం( సెప్టెంబర్ 20) లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది,  గురువారం( సెప్టెంబర్ 21) పెద్దల సభలోనూ పాసై ..రేపో మాపో చట్టంగా బయటకు వస్తుంది. సరే, మహిళా బిల్లు చట్టం అయినా  2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాదు.  ఎన్నికల తర్వాత జనగణన, డీలిమిటేషన్  ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మహిళల రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని  హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. అయినా చట్టం అమలుకు సంబంధించి ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా అది ప్రస్తుతానికి అప్రస్తుతం. కనుక దానిని పక్కన పెడితే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు చాలా ముందునుంచి రాజకీయ వర్గాల్లో  జమిలి ఎన్నికల చర్చ బలంగా నడుస్తోంది. అయితే, ప్రస్తుతానికి   ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ఆ అంశం చుట్టూనే  చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు? అనే ఉత్కంఠ ఉంది.

మహిళా బిల్లు తరహాలో ముందస్తు సమాచారం లేకుండా జమిలి బిల్లును ప్రభుత్వం తెస్తుందా అన్న అనుమానాలున్నాయి. మహిళా బిల్లు తరహాలో  2029 ఎన్నికల నుంచి అమలుచేసే విధంగా జమిలి ఎన్నికల బిల్లును తెస్తుందా, అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలపై  బీజేపీ, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఈ టర్మ్ పూర్తయ్యే లోగా, ఈ రెండు హామీలకు చట్ట బద్దత   కల్పించే ఉద్దేశంతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వాహించానే నిర్ణయం తెసుకున్నట్లు బీజీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో అవసరం అయితే, ప్రత్యేక సమావేశాలను మరో ఒకటి రెండు రోజులు పొడిగించి జమిలి బిల్లును ‘మమ’  అనిపించినా అనిపించవచ్చని అంటున్నారు. 

అదే నిజమైతే, లోక్ సభ ఎన్నికలను ముందస్తుకు జరిపి, ఆ ఎన్నికలతో పాటుగా, ఐదారు నెలలు అటూ ఇటుగా ఎన్నిలు జరగ వలసిన రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను అటూ ఇటు చేసిన మినీ జమిలి ఎన్నికలు జరుపుతుందా అనే విషయంలోనూ అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ అనుమానాలు మరింత  బలంగావినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి తారక రామా రావు, అసెంబ్లీ  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా  పడే   అవకాశం లేక పోలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటుగా వచ్చే మార్చి,ఏప్రిల్ లో జరిగ వచ్చని అన్నారు. అందుకు తగ్గట్టునే భారత ప్రాధాన ఎన్నికల  కమిషనర్ రాజీవ్ కుమార్, అసెంబ్లీ ఎన్నికలను గడువుకు  ఆరు నెలలు ముందు  వెనక నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొన్నారు. 

అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బుధవారం( సెప్టెంబర్20) జరిగిన మంత్రివర్గ సమావేశంలో  ముదస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  జమిలి లేదా ముందస్తు ఎన్నికలపై  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, చూద్దాం .. ఆ తర్వాత ముందస్తు పై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నట్లు తెలుస్తోంది, మరో వంక బీజేపీ నాయకులు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు యథాతథంగా గడువు ప్రకారమే జరుగుతాయని పైకి అంటున్నా, వ్యక్తిగత సంభాషణల్లో  మినీ జమిలి అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని అంటున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పడం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతాయని అంటున్నారు. అయితే అది ఈ ఏడాది డిసెంబర్ లోనా, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే అనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అంటున్నారు. 

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.