తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ప్రతీకగా నిలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి.. తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
ప్రజలు తమ తమ వృత్తుల్లో విజయం సాధించాలని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని అమ్మవారి కరుణాకటాక్షాలను కోరుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుం టారని, బోనాల పండుగను కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములై ఘనంగా జరుపుకుంటా రని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.గతంలో ఈ ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు అమ్మవారు ప్రజలను ఆదుకున్నారనే విశ్వాసం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం కూడా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బోనాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
Ashada Bonalu, Minister Ponnam Prabhakar, Ujjain Mahakali Ammavari Bonalalu, Hyderabad Bonalu Celebrations, Telangana Spiritual News, Telangana Goverment
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ashada-bonalu-36-227786.html
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది.
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.