ఈడీ ఎదుట హాజరైన అరవింద్ కుమార్
Publish Date:Jan 9, 2025
Advertisement
ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆర్ బిఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు బదిలీచేసినట్టు అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి కెటీఆర్ సూచనమేరకు తాను నిధులు బదిలీ చేసినట్ట అరవింద్ కుమార్ ఈడీ అధికారుల ఎదుట అంగీకరించారు. పురపాలకశాఖమంత్రి కెటీఆర్ సూచనమేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో అరవింద్ కుమార్ ఈ నిధులను బదిలీ చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఈ ఐఏఎస్ అధికారి ముఖ్యభూమిక వహించారు. మూడో పర్యాయం కూడా బిఆర్ ఎస్ వస్తుందని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ ఈడీ అధికారుల ఎదుట అన్నట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/arvind-kumar-who-appeared-before-the-ed-39-191069.html





