Publish Date:Feb 25, 2026
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. నాలిక కోస్తా అనడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందన్న పేర్కొన్న సుప్రీం కోర్టు.. ఆ మాటలను పట్టుకుని అదే నిజమని నమ్మి సెక్యూరిటీ కోరడం తగదని సూచించింది. గతంలో మీ కుటుంబంలో ఆరుగురి హత్య జరిగిందని ఇప్పుడు సెక్యూరిటీ కోరడం కూడా సరైనది కాదని పేర్కొంది.
ఇక గతంలోకన్నా ప్రస్తుతం పోలీసులకన్నా మిన్నగా ప్రైవేట్ సెక్యూరిటీ పని చేస్తోంది. కాబట్టి మీరు మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోమని సుప్రీం కోర్టు కాటసాని న్యాయవాదులకు సూచించింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి డబ్బు శక్తి ఉందని అనడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని అంటారాయన. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండవు.
అయితే కాటసానిది ఫ్యాక్షన్ కుటుంబం. మే 27, 1979న జరిగిన ఒక దారుణమైన ఘటనలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తండ్రి, ఆయన ఆరుగురు దాయాదులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1986లో ఆయన సోదరుడు కూడా హత్యకు గురయ్యారు. వీటి ఆధారంగా ఇప్పుడు ముప్పు ఉందనడమేంట సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక వేళ మీకు ప్రాణహాని ఉంటే, లోకల్ పోలీసులకు తెలియక పోదు. వారు కూడా ఒక శాస్త్రీయమైన అంచనాకు వచ్చినపుడు ఆటోమేటిగ్గా మీకు భద్రత కల్పిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగానీ మీరు ప్రతిపక్ష నేత కాబట్టి సెక్యూరీటీ కావాలంటే కుదరదని పేర్కొంటూ, మీరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సెక్యూరిటీ ఉండేది. అది కూడా లేక పోవడంతోనే 2ప్లస్2 భద్రత తొలగించారు. ఇవాళ,రేపు ఏదో ఒక పార్టీల్లో చేరడం చాలా చాలా సులువు. అలాంటిది మేం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.. సెక్యూరిటీ కలిపించమని అందరూ వచ్చి అడిగితే.. ఉన్న పోలీసు వ్యవస్థ చాలదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arrange-your-own-security-25-214631.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.