Publish Date:Jan 20, 2025
పేదలు సంజీవినిగా భావించే ఆరోగ్య శ్రీ సేవలు తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను చెల్లించకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో వేయి కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద వైద్య సేవలు అందించడం తమ వల్ల కాదని తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రిలు చేతులెత్తేశాయి. గత కొంత కాలంగా తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ బకాయిల గురించి ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి పది రోజులకు పైగా గడిచినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో పేదల రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చాలా ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పదిలక్షల రూపాయలకు పెంచింది. అయితే దాని వల్ల ఉపయోగం ఏముందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచినట్లు గొప్పగా ప్రకటించిన రేవంత్ సర్కార్ పేరుకుపోయిన బకాయిలను పట్టించుకోకపోవడం వల్ల పరిమితి పెంపు ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోయి పది రోజులు గడిచిపోయినా, పేరుకుపోయిన బకాయిల విడుదల ఊసెత్తకుండా, అసలు నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తో చర్చలు కూడా జరపకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం లు కూడా పని చేయడం లేదని, ఆయా కార్డుల పరిస్థితి విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా తరయారయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పేద ప్రజలకు శాపంగా మారిందని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. హరీష్ వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ప్రతి విమర్శ చేశారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మాని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arogya-sri-services-band-in-telangana-39-191575.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.