జీవితం మొత్తం ఫూల్స్ కావొద్దు.. 

Publish Date:Apr 1, 2025

Advertisement

 


ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. చాలామందికి చిన్నతనంలో  ఏప్రిల్ ఫూల్ అంటూ చేసిన సందడి గుర్తొస్తుంది.  చిన్నతనంలో ఏదో ఒక తుంటరి సాకు చెప్పడం,  ఎదుటివారిని భయపెట్టడం వారు భయపడటం లేదా అప్రమత్తం కావడం జరగగానే ఏప్రిల్ ఫూల్ అనడం చాలామంది ఎంజాయ్ చేసిన సంఘటనలే.. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఒక సరదా రోజుగా  అందరికి తెలుసు.. కానీ ఏప్రిల్ ఫూల్ రోజు జరిగే తమాషా సంఘటనలలో పూల్స్ అయినా పర్లేదు కానీ నిజ జీవితంలో ఫూల్స్ కాకండి అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే అమాయకంగా ఫూల్స్ అయిపోతుంటారు.  నిన్న కాక మొన్నే తెలుగు సంవత్సరం వచ్చింది.   ఈ కొత్త ఏడాదిలో అయినా ఎవరైనా ఫూల్స్ కాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ కింద చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోవాలి.

జీవితం, తమాషా..

రోజువారీ జీవితంలో సంతోషం,  తమాషా అనేవి ఉండటం మంచిదే.. కానీ జీవితమే తమాషా కాకూడదు.  ఇలా జీవితమే తమాషా అయితే ఆ తరువాత ఇతరులకు మన జీవితం ఒక ఆట వస్తువుగా లేక విలువ లేని చిత్తు కాగితంలా అనిపిస్తుంది. అందుకే జీవితంలో తమాషా ఉన్నా జీవితాన్ని తమాషా కానివ్వకూడదు.  జీవితంలో లక్ష్యాల  పట్ల,చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి.  చెయ్యాల్సిన పనిని ఇతరుల కారణంగా ఎప్పుడూ వాయిదా వేయడం,  చేయకుండా ఆపేయడం వంటివి చేయకూడదు. చేసే పని మంచిది అయినప్పుడు,  ఉపయోగకరమైనది అయినప్పుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ అయ్యి దాన్ని వదలకూడదు. ఎందుకంటే చేసే పని,  పని  చేసే విధానం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది.

మంచి, చెడు..

ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనేవి ఉంటాయి.  కానీ మనిషి తన జీవితంలో జరిగే మంచి అయినా చెడు అయినా తాను కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాడు. ఇది చాలా వరకు తప్పు. అయితే మంచి, చెడు అనేవి వ్యక్తి ఆలోచనా  విధానం మీద ఆధారపడి ఉంటుంది.   ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించే అవకాశం ఉంది. దీని వల్ల మంచి చెడుల విషయం తేల్చుకునే అవకాశం చాలా మందికి ఉండదు. అయితే ఏ పని అయినా  ఇతరులకు అపకారం చేయకుండా నష్టం కలిగించకుండా మనకు మేలు చేసే విధంగా ఉన్నంత వరకు ఆ పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు.

విలువలే.. వ్యక్తిత్వం..

ప్రతి మనిషి విలువలు కలిగి ఉండాలి.  ఇలా విలువలు కలిగి ఉండటమే మనిషి జీవితానికి గొప్ప ఆస్తి.  మనిషిలో ఉన్న విలువలు  మనిషి వ్యక్తిత్వాన్ని  వ్యక్తం చేస్తాయి. అందుకే విలువలను ఎప్పటికీ వదలకూడదు.  ఇతరుల పట్ల మంచిగా ఉండటం,  ఇతరులను గౌరవించడం,  ఇతరులకు సహాయం చేయడం,  ప్రేమ,  జాలి, కరుణ, దయ వంటివి ఉండటం.. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వాన్ని,  సెల్ఫ్ రెస్పెక్ట్ ను పోగొట్టుకోకుండా పాటించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా,  గొప్పగా అనిపిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవం, మర్యాద మన గౌరవాన్ని పెంచుతాయి.

నమ్మకం, అపనమ్మకం..

మనిషి జీవితం నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.  తరువాత నిమిషం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు. అలాంటప్పుడు మనుషులను,   పరిస్థితులను నమ్మకం అనే ఒక తాడులో బంధించి ఆ తరువాత దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెగిపోయినా దానిదే తప్పని, ఇతరులదే తప్పని అనడం ఆ వ్యక్తిదే నిజమైన తప్పు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉండాలి. అంతేకానీ నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా బాధలలోకి జారిపోకూడదు.


                                        *రూపశ్రీ.


 

By
en-us Political News

  
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.