Publish Date:May 15, 2025
భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడి.. భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. టిమ్ కుక్ భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని, అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానని, ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్‌లు విధించడం.. అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండటంతో యాపిల్ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈవో టిమ్ కుక్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకొంటామన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్‌లను ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ ఓ డీల్‌ను ఆఫర్ చేసింది. ఇది ప్రాథమికంగా జీరో టారిఫ్‌లదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై జోరుగా చర్చలు జరుపుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్ 30వ తేదీ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఒప్పందానికి వస్తామని నాడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటిదిప్పుడు యాపిల్ మన దేశం నోటి దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/apple-company-39-198126.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.