మళ్ళీ రాజుకున్న సీట్ల పంచాయతి!

Publish Date:Jun 27, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం  2014 లో ఇచ్చిన అనేక హామీల్లో, నియోజక వర్గాల పునర్విభజన కూడా ఒకటి. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ళు పూర్తయినా, కేంద్రం ఆ ఊసే ఎత్తలేదు సరికదా, 2026 వరకు దేశంలో ఎక్కడా నియోజక వర్గాల పునర్విభజన  చేపట్టే  అవకాశమే లేదని  తేల్చేసింది. అయితే, జమ్మూ కశ్మీర్’కు రద్దయిన రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఆ రాష్ట్రంలో నియోజక నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకోసంగా రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు గత గురువారం, జమ్మూ కశ్మీర్ రాజకీయ నేతలతో నిర్వహించిన సమావేశంలో, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అంటే, ఆయన తమ నోటితో చెప్పక పోయినా, రాజకీయ పార్టీలు కోరుకుంటున్న, రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ జరగాలంటే నియోజక వర్గాల పునర్విభజనకు రాజకీయ  పార్టీలు సహకరించి తీరాలని, మెడ మీద కత్తి పెట్టారు. జమ్మూ కశ్మీర్ పార్టీలు, నియోజక వర్గాల పునర్విభజనను కోరుకోవడం లేదు, కాదు, వ్యతిరేకిస్తున్నాయి. అందుకే,దేశాయ్ కమిటీ ఏర్పడి ఇంచుమించుగా సంవత్సరం అయినా, ప్రాంతీయ పార్టీల సహాయ నిరాకరణతో, కమిటీ పని కదలడం లేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. అందుకే, ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి నియోజక వర్గాల పునర్విభజనకు ప్రాంతీయ పార్టీలను ఒప్పించారు. 

కానీ, అదే సమయంలో ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల విభజన చేపట్టాలని కోరుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కోరుతున్నా ససేమిరా అటున్నారు. ఎందుకీ ద్వంద వైఖరి అంటే, జమ్మూ కశ్మీర్’లో నియోజక వర్గాల పునర్విభజన వలన బీజేపీకి ప్రయోజనం, తెలుగు రాష్ట్రాలలో ఇక్కడి పాలక పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ప్రయోజనం, అందుకే అక్కడో నీతి, ఇక్కడో నీతి పాటిస్తున్నారు, అనుకోవలసి వస్తుంది. 

అయితే, ఇప్పుడు ఈ ద్వంద నీతి కారణంగానే తెలుగు రాష్ట్రాలలో మరోమారు, సీట్ల పంచాయతీ రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్’ కేంద్ర ప్రభుత్వ ద్వంద నీతిని ప్రశ్నిస్తూ, జమ్మూ కశ్మీర్ సూత్రాన్నే తెలుగు రాష్ట్రాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం  2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని వినోద్  శనివారం డిమాండ్ చేశారు.రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను తక్షణం పెంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబిచ్చారని ఆయన పేర్కొన్నారు.

మరి ఈ సూత్రం జమ్మూ, కాశ్మీర్ ము ఎందుకు వర్తించదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ లో రాజకీయ కోణంలో అక్కడ అసెంబ్లీ సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. జమ్మూ,కాశ్మీర్ లో అఖిలపక్ష సమావేశంతో ఈ విషయం తేలిపోయిందని ఆయన తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అని విమర్శించారు. రాజకీయ కుయుక్తులు పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు తక్షణమే పెంచాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కు పెంచాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. అయితే, నియోజక వర్గాల పునర్విభజన వలన తెలంగాణలో తెరాస కు, ఏపీలో వైసీపీ, తెలుగు దేశం పార్టీలకు ప్రయోజనం చేకురుతుందే తప్ప బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఉండదు. అందుకే ఇంతవరకు , కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల డిమాండ్’ను పట్టించుకోలేదు. ఇప్పుడైనా పట్టించుకుంటుందా,అంటే, డౌటే అంటున్నారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.