బాబువైపు బీజేపీ.. వైసీపీకి ప్రమాద ఘంటికలు?

Publish Date:Apr 26, 2023

Advertisement

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయి.  దాదాపు ఐదేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న బీజేపీ తెలుగుదేశం పార్టీలు  మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా?  అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందన్నది కమలం పార్టీ భావన. అలాగే ఏపీలో బీజేపీతో మైత్రి అధికార వైసీపీని ఇబ్బందుల్లో నెట్టి విజయాన్ని నల్లేరు మీద బండి నడక చేసుకోవడానికి దోహదపడుతుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు కోరుకుంటోంది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం పార్టీ అగ్రనాయకత్వానికి చేరవేసిందని పార్టీ శ్రేణులో అంటున్నాయి.

తెలంగాణలో కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని  బీజేపీ అగ్రనాయకత్వం కూడా గుర్తించిందని చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేనల మధ్య అప్రకటిత పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తెలుగుదేశంతో కలవడం ఉభయతారకంగా ఉంటుందన్న అభిప్రాయం కమలం అగ్రనాయకత్వంలో కలిగిందని అంటున్నారు. ఆ కారణంగానే  ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ  దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇంత కాలం.. వైసీపీ ఉ అంటే ఉ, ఉహూ అంటే ఉహూ అన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించినా ఆ పార్టీ అధిష్ఠానం చూసీ చూడనట్లు వదిలేసింది. అయితే ఇటీవలి కాలంలో అటు బీజేపీ అగ్రనాయకత్వంలోనూ, ఇటు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై అటు బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులూ కూడా ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో  తెలుగుదేశం కూడా..  ఇటీవలి కాలంలో బీజేపీ విధానాలకు సంబంధించి ఎటువంటి విమర్శలూ చేయలేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాట్ల విషయంలోనూ జోక్యం చేసుకోలేదు.

తాజాగా  ఒక జాతీయ టీవీ చానెల్  నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీజేపీ మోడల్ అభివృద్ధికి, ప్రధాని మోడీ విజన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించేశారు. పనిలో పనిగా గతంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికీ, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి విభేదాలు కారణం కాదనీ, సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా అంశమేననీ కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యతకు అధికారిక ప్రకటనే తరువాయి అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రంలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలవడం అన్న ఊహే జగన్ సర్కార్ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది.

అందుకే గతంలో  హస్తినలో ఒక కార్యక్రమంలో మోడీ స్వయంగా చంద్రబాబును పలకరించి కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఉలిక్కిపడింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి  భుజాలు తడుముకున్నారు.  మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నఅభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఈ మార్పు కచ్చితంగా అధికార వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.