ఏపీ స్థానిక ఎన్నికలు.. అందరి దృష్టీ పులివెందులపైనే.!
Publish Date:Aug 26, 2026
Advertisement
ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ అడ్డా అయిన పులివెందుల మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది. అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది. అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు.. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.
AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne
http://www.teluguone.com/news/content/ap-localbody-elections-39-229922.html





