ఏపీలో మద్యం స్కాం.. కేంద్ర హోంమంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు? ఏం జరుగుతుంది?

Publish Date:Oct 9, 2023

Advertisement

ఏపీ విషయంలో బీజేపీ వైఖరి మారుతోందా? జగన్ కు దూరం జరుగుతోందా? ఏపీలో ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అడ్డగోలు విధానాపై దృష్టి పెట్టిందా? అంటూ ఒక్క రోజులో.. అంటే హస్తినలో ఏపీ సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ తరువాత స్వల్ప వ్యవధిలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో జగన్ ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పులు, మద్యం విధానంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శలు గుప్పిస్తూ, అధిష్ఠానానికి ఫిర్యదులు చేస్తూ వచ్చిన పురందేశ్వరి తాజాగా సిరికిం చెప్పడు అన్నట్లుగా హస్తిన బయలుదేరి వెళ్లారు. అసలు ముందుగా అనుకున్నట్లు అయితే ఏపీలో జగన్ సర్కార్ పట్ల తాము అనుసరించాల్సిన వైఖరి ఏమిటి? యుద్ధం చేయాలా? రాజీ పడాలా? తేల్చండి అంటూ హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చేందుకు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తిన వెళ్లాల్సి ఉంది. అందుకోసం తేదీ ఖరారు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉరుములేని పిడుగులా పురంధేశ్వరి ఆదివారం ( అక్టోబర్ 8) మధ్యాహ్నమే హడావుడిగా హస్తినకు వెళ్లారు. వెళ్లీ వెళ్లడంతోనే అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించింది. అమిత్ షాను కలిసి ఏపీలో మద్యం కుంభకోణంపై ఫిర్యాదు చేయడమే కాదు.. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

పురందేశ్వరి అధిష్ఠానం పిలుపు లేకుండా ఆమె అంతట ఆమె హస్తిన వెళ్లి, అమిత్ షాతో భేటీ అయ్యారనీ, జగన్ సర్కార్ మద్యం విధానంపై ఫిర్యాదు చేసి.. అదో పెద్ద స్కాం.. దానిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలనీ కోరారని భావించలేం. మద్యం స్కాం కు సంబంధించిన వివరాలతో హస్తినకు రావాల్సిందిగా హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాదు పురంధేశ్వరి ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై విచారణ ఇహనో ఇప్పుడో ఆరంభం అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోనికి వచ్చినప్పుడే ఏపీ మద్యం కుంభకోణం గురించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంతే కాదు.. అంత కంటే ముందు నుంచీ కూడా ఏపీ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఏపీ మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

ఇందుకు కారణం.. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టీపట్టగానే రాష్ట్ర మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. సంపూర్ణ మద్య నిషేధం కోసం అంటూ మొత్తం మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. దీంతో మద్యం వ్యాపారం వైసీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది.  అంటే దశల వారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. ఆ పేరుతో మద్యం దుకాణాలన్నీ వైసీపీ అధినం చేసుకుంది.  కాదు కాదు ప్రభుత్వమే అలా చేసింది.  ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీలోని ప్రభుత్వ అధీనంలోని మద్యం దుకాణాలలో ప్రముఖ బ్రాండ్ల మద్యం దొరకదు. అక్కడ దొరికేదంతా జె బ్రాండ్ గా గుర్తింపు పొందిన మద్యమే. ఈ బ్రాండ్ల మద్యం  మాత్రమే ఏపీలో లభ్యమౌతుంది.

మరో  రాష్ట్రంలోనూ ఈ బ్రాండ్ల జాడ కనిపించదు. అలాగే ప్రపంచం అంతా డిజిటల్ మనీ అంటుంటే ఏపీలో అదీ ఒక్క మద్యం వ్యాపారం మాత్రం నో డిజిటల్ ఓన్లీ క్యాష్ విధానంలో  ఇటీవలి వరకూ కొనసాగింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు  కూడా అనుమతించారు. అయితే ఏపీ మద్యం వ్యాపారంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ నామమాతరమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏపీ మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం, అదీ స్వయంగా  హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.