Publish Date:May 12, 2022
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కార్ కు లేదని వరసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసం జగన్ సర్కార్ ఏకంగా సుప్రీం తీర్పును కూడా ఉల్లంఘించి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది.
తన నిర్ణయాలను తప్పుపడితే కోర్టులపై కూడా విమర్శలు గుప్పించి, జడ్జీలకు ఉద్దేశాలను ఆపాదించడం జగన్ సర్కార్ కు ఒక అలవాటుగా మారింది. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఏపీ సర్కార్ నేరుగా సుప్రీం కోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సీనియర్ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు విస్పష్ట ఆదేశాలిచ్చి రెండు వారాలు గడిచినా, ఇంత వరకూ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
పైపెచ్చు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఎస్ ను కలిసిన వెంటకేశ్వరరావుకు అవమానమే ఎదురైంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఓ సారి చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చయాలని కోరిన ఏబీవీకి ప్రాసెల్ లో పెడతామన్న సమాధానం వచ్చింది. అయితే ఆ తరువాత తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగినప్పుడు కనీసం సర్వీసులోకి తీసుకున్నట్లుగా ఆదేశాలు రాలేదు.
ఈ నేపథ్యంలోనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని అడిగేందుకు మరోసారి ఆయన సచివాలయానికి వెళ్లారు. సీఎస్ అందుబాటులో లేకపోవడంతో, మరోసారి బుధవార వెళ్లారు. అయతే ఈ సారి అవమానకరంగా ఆయనను వెయిటింగ్ రూములో ఉంచి సీఎస్ బయటకు వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై కక్షసాధింపులో భాగంగానే సర్కార్ ఇలా వ్యవహరిస్తున్నదన ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారం చేపట్టగానే ఆయనపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ సర్కార్ ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. సర్కార్ తీరు సివిల్ సర్వీస్ అధికారులలో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంతో దాదాపు పది మంది అధికారులు శిక్షకు గురైన సంగతి తెలిసిందే. తొలుత జైలు శిక్ష విధించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత అధికారుల విజ్ణప్తిపై ఆ శిక్షను సామాజిక సేవా శిక్షగా మార్చింది. ఇప్పుడు సుప్రీం ఆదేశాల ఉల్లంఘన పై సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందోనన్న చర్చ అధికారులలో జరుగుతోంది. ప్రభుత్వ తప్పిదాలకు సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షలకు గురి కావడం ఇప్పుడు ఏపీలో సర్వసాధారణ విషయంగా మారిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ignore-supreme-cerdict-on-abvs-posting-25-135779.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.