జీవో 1 ను సస్పెండ్ చేసిన హైకోర్టు
Publish Date:Jan 12, 2023
Advertisement
ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్రంలో సభలూ, సమావేశాలపై నిషేధం విధిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నంబర్-1ను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జీవో నంబర్ 1 ప్రకారం సభలు, రోడ్‌షోలు, అనుమతి లేకుండా.. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హై కోర్టు గురువారం (జనవరి 12)న విచారించింది. జీవో నంబర్ 1ను ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఈ జీవో చెల్లదని మొదటి నుంచీ తెలుగుదేశం సహా అన్ని విపక్షాలు చెబుతూ వస్తున్నసంగతి విదితమే.
http://www.teluguone.com/news/content/ap-high-court-suspends-go-one-25-149952.html





