ముదురుతున్న వాటర్ వార్.. ఏపీ రియాక్షన్ పవర్ ఫుల్.. 

Publish Date:Jun 25, 2021

Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం.. వెంటనే స్పందించిన కృష్టా బోర్డు ప్రాజెక్టులు ఆపాలని ఏపీ సర్కార్ కు లేఖ రాయడం జరిగిపోయింది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మాట్లాడుతున్నారు. జగన్ తో పాటు దివంగత వైఎస్సార్ ను టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుండటంతో వాటర్ వార్ హీటెక్కింది. 

తమపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడంతో... అదే స్థాయిలో కౌంటరిచ్చింది ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వాడుకుంటోందని ఆరోపిస్తూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇది ఏపీ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని అభ్యంతరం చెప్పింది.  వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని డిమాండ్‌ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాలతో ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారని చెప్పారు.  ఇప్పటికే ఒకసారి ఈ విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చినా విద్యుదుత్పత్తి కొనసాగుతూనే ఉందని ఏపీ ఈఎన్‌సీ గుర్తు చేశారు. ఇప్పటికే పలుమార్లు చెప్పినా వినే పరిస్థితి లేదని, 

శ్రీశైలంలో ప్రస్తుతం 808 అడుగుల్లోనే నీరు ఉందని, అయినా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నీటిని వాడుకుంటోందని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖలో ఈఎన్సీ నారాయణరెడ్డి ఆరోపించారు. 834 అడుగులు ఉంటేనే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించడం లేదని వివరించారు. కృష్ణా బోర్డ్ అనుమతి లేకుండానే నీటిని విడుదల చేస్తోందని పేర్కొన్నారు. జూన్‌ 1 నుంచి ప్రారంభమైన నీటి ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 8.98 టీఎంసీలే వచ్చాయని, అందులో 3.09 టీఎంసీలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు. మొత్తం నీటి ప్రవాహా౦లో ఇది 34 శాతం తెలంగాణ వాడుకుందని తెలిపారు. 

విద్యుత్‌ ఉత్పత్తి ఆపకపోతే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పడిపోతుందని, అదే జరిగితే పోతిరెడ్డిపాడుకు నీటి సరఫరా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జలాశయంలో 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా చెన్నైకి, మిగిలిన ప్రాజెక్ట్‌లకు నీటి సరఫరా కష్టంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కోరారు. వరదల సమయంలో తప్ప శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ఉమ్మడి జలాశయాల నుంచి కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని తీసుకోవడానికి వీలు లేదని, తెలంగాణ విద్యుదుత్పత్తికి ఎలాంటి అనుమతులు లేవని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తన లేఖలో వివరించారు. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.