రాజధానులా.. రఘురామా.. గవర్నర్ హస్తినకెందుకు?

Publish Date:Jun 15, 2021

Advertisement

కేంద్రం నుంచి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ కు పిలుపు వచ్చింది.  కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న వేళ.. ఈ పిలుపు రావడంతో.. కాస్త ఆసక్తికరంగా మారింది. మూడు రకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకటి జగన్, అమిత్ షాల మధ్య  మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగిందని.. దానిపైనేనని ఒక వర్గం.. అది కాదు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మీద మాట్లాడటానికే పిలిచారని ఇంకో వర్గం చెప్పుకుంటుంది.

గతంలో నరసింహన్ రెండు రాష్ట్రాల గవర్నర్ గా ఉండగా పదేపదే పిలుపులు వచ్చేవి. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ తెలుసుకోవడానికి పిలిచేవారు. ఇక రెండు రాష్ట్రాలకు చెరో గవర్నర్ వచ్చాక..ఢిల్లీ పిలుపులు ఆగిపోయాయి. పైగా ఏపీ,తెలంగాణ మధ్య ఒక నదీజలాల గొడవ తప్ప ఇంకో గొడవేమీ మిగల్లేదు. రాజకీయంగా ఇద్దరు సీఎంలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు కూడా. సో గవర్నర్ కి పెద్దగా రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. పైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఓపెన్ గానే... అది కూడా ఢిల్లీవారికి కబురు పంపాకే చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర బిజెపి నేతలు ఒప్పుకోకపోయినా.. కేంద్ర బిజెపి నేతలు ఖండించనూ లేదు. సో బిజెపివారు రహస్యంగా సమాచారం సేకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు.

మరెందుకు పిలిచినట్లు గవర్నర్ గారిని? మొన్ననే ఎమ్మెల్సీ ఫైలు ఆపారు.. మళ్లీ లేటెస్టుగా అప్రూవ్ చేసేశారు గవర్నర్. ఆ పని కూడా అయిపోయింది. ఇంకెందుకు పిలిచినట్లు? ఎక్కువమంది అభిప్రాయపడేది మాత్రం మూడు రాజధానుల వ్యవహారమేనని. ఎందుకంటే అమిత్ షాతో సంప్రదింపుల్లో మూడు రాజదానుల ఏర్పాటుపై చర్చించినట్లు వైసీపీ అధికారికంగానే ప్రకటించింది. మరోవైపు ఆ పార్టీ నేతలు, మంత్రులు అతి త్వరలో విశాఖ నుంచే పాలన ఉండబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ విషయంపైనే గవర్నర్ ను పిలిచి ఉంటారని.. నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియ అంతా గవర్నర్ చేతుల మీదుగా జరగాల్సి  ఉంటుంది కాబట్టి..ఆయనతో చర్చించడానికే పిలిచారని చెప్పుకుంటున్నారు. కాని హైకోర్టులో కేసులు విచారణలో ఉండగా..అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని..కాబట్టి దాని గురించి అయి ఉండదనే వాదన కూడా వినపడుతోంది.

ఇక రఘరామకృష్ణరాజు ఎపిసోడ్ నడుస్తోంది. సీఐడీ అధికారులు హింసించారనే ఆరోపణలు చేయడం..తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి గాయాలున్నాయని నిర్ధారించడం..తర్వాత నర్సాపురం ఎంపీ స్పీకర్, ఇతర ముఖ్యులందరికీ లేఖలు రాశారు. ప్రివిలేజ్ మోషన్ కు సైతం రఘురామ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ సైతం రఘురామను సస్పెండ్ చేయాలని పట్టుబడుతోంది. అమిత్ షాతో సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ ను పిలిచారని అంటున్నారు. అయితే గియితే ఏం జరిగిందనేదానిపై గవర్నర్ ని అడిగే అవకాశం ఉంది తప్ప..నిర్ణయాల కోసమైతే అవసరం లేదని అధికారులు అనుకుంటున్నారు.

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.