ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తన స్వంత ఎజెండా కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షర్మిల ఒంటెత్తు పోకడలతో సీనియర్లకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా జగన్ వ్యతిరేకతే పార్టీ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాకుండా ఒక స్వతంత్ర వ్యక్తిగా తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్లు సైతం అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు తిలోదకాలిచ్చి జగన్ ను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అదే తన బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, దీని వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని సీనియర్లు అంటున్నారు.
అంతే కాకుండా షర్మిల తీరు పార్టీ సినియర్లను పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తున్నదనీ, ఇసుమంతైనా ఖాతరు చేయకుండా ఆమె తమను అవమానిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన కబుర్లు అంటూ సీనియర్ల సలహాలను ఆమె తీసి పారేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారకుడైన కేవీపీ ఆమె ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రతి సమావేశంలోనూ ఆమె వెన్నంటి ఉండి మార్గదర్శనం చేసేవారనీ, అయితే ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
షర్మిల వైఖరికి విసిగి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చేశారనీ, ఆయన పార్టీని దారుణంగా ఓడించి జగన్ పట్ల తమ అభిప్రాయమేమిటో చెప్పేశారనీ, అయినా ఇప్పటికీ షర్మిల జగన్ పై విమర్శలకే పార్టీని, పార్టీ కార్యక్రమాలను పరిమితం చేయడం విడ్డూరంగా ఉందనీ అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయి నుంచీ పని చేయాల్సి ఉంటుందనీ, అయితే షర్మిల తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆమె పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొత్తలో కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేశమాత్రమైనా కనిపించకపోవడానికి ఆమె వ్యవహారశైలే కారణమంటున్నారు. ఇప్పటికైనా షర్మిత తన తీరు మార్చుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-congress-chief-sharmila-unilateral-attitude-25-186496.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.