రఘురామ లేఖాస్త్రాలతో జగన్ మైండ్ బ్లాకవుతోందా?
Publish Date:Jun 30, 2021
Advertisement
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరుకోవు, ఇదొక సామెత. ఈ సామెత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామా కృష్ణం రాజుకు ఎంత వరకు వర్తిస్తుందో ఏమో కానీ, ఇంచుమించుగా సంవత్సర కాలం పాటు, సొంత పార్టీని, పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రచ్చబండకు పెట్టి ఉతికి ఆరేసిన ఆయన, చివరకు ప్రభువుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద కక్షకట్టి, కేసులు పెట్టింది. కేసులంటే, చిన్నా చితక చిల్లర కేసులు కాదు. ఏకంగా రాజ ద్రోహం కేసు పెట్టింది. అరెస్ట్ చేసింది. వేధింపులకు గురిచేసింది. చివరకు దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీసులు ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు. అయినా అయన వెనక్కు తగ్గలేదు, కానీ, న్యాయస్థానం విధించిన అంక్షల కారణంగా మీడియా ముందుకు రావడం లేదు. కానీ, ఇప్పుడు మరో రూటులో అదే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రికి నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరిట లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోకడలను ఎండకడుతున్నారు. వ్యంగాస్త్రాలు సంధిస్తూ ముఖ్యమంత్రిని ఎగతాళి చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇమేజిని రఘురామ కృష్ణం రాజు అందరికంటే ఎక్కువగా డ్యామేజి చేస్తున్నారు. అందుకే, వైసీపీ నాయకులు ఆయన మీద కారాలు మిరియాలు నురుతున్నారు. బుసలు కొడుతున్నారు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఓం బిర్లాకు అదే పనిగా లేఖలు రాస్తున్నారు. అయినా అటు నుంచి స్పందన లేక పోవడంతో జగన్ రెడ్డి, చాలా అసహనానికి గురవుతున్నారు. చివరకు చట్ట సభల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిసినా, ఏ2 విజయసాయి న్యాయవాదుల ద్వారా కోర్టులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫర్ ఎ చేంజ్, రఘురామ కృష్ణం రాజు మంగళవారం రూట్ మార్చారు. ఈ సారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. అది కూడా ఏపీ రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలని కోరారు. పీవీ శతజయతి వేడుకలను పురస్కరించుకుని అయన ఈలేఖ రాశారు. ఈ అభ్యర్ధన చేశారు. అలాగే, ఈ లేఖలో కృష్ణం రాజు, పీవీ గొప్ప తనాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా ఆయన ముందు చూపుతో ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ఇస్తున్న ఫలాలను ప్రస్తావించారు. అదే విధంగా పీవీకి భారత రత్న ప్రకటిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 కోట్ల తెలుగు వారు మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడు గర్వ పడతారని, అందుకు ఆయన శతజయంతి వేడుకలు సరైన సమయమని పేర్కొన్నారు. పీవీ నరసింహ రావు తెలుగు నేలకు మాత్రమే కాదు, భారతీయులు అందరికీ, ప్రాతః ప్రాతఃస్మరణీయులు. పరిపాలనా పరంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన భూసంస్కరణలు, దేశ ప్రధానిగా ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి దిక్సూచిలా నిలిచాయి. అదే విధంగా ఆయన బహుబాషా కోవిదులు, పలు విదేశీ భాషలు సహా 17 భాషలలో ఆయనకు గల ప్రావీణ్యం, ఆయన చేసిన సాహిత్య సేవ, తెలంగాణ విమోచన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర, దేనికవే, చరిత్ర గతిని తిప్పిన మైలు రాళ్ళు.సో.. ఆయనకు భారత రత్న ప్రకటించాలని కోరడం సముచితం. అలాగే, మరో తెలుగు వెలుగు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావుకు కూడా భారత రత్న ప్రకటించాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నారు. ప్రధాని మోడీ, మొన్నీ మధ్యనే తెలుగు భాష గొప్పదనం గురించి గొప్పగా చెప్పారు. తెలుగు వారి గొప్పతనాన్ని కూడా అదే విధంగా గుర్తిస్తారని ఆశిద్దాం. రఘురామ లేఖాస్త్రాలు జగన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని, మైండ్ బ్లాకయ్యేలా చేస్తున్నాయి అంటున్నారు.సమాధానాలు చెప్పుకోలేకనే అర్థరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు .. రాత్రుల్లో ఎవరెవరితోనో ఏవేవో మాట్లాడేసు కుంటున్నారు.అందుకే ఎవరికన్నా చూపిస్తే మంచిదేమో .. అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-fear-on-mp-raghurama-raju-letters-39-118640.html





