మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం!

Publish Date:Jun 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం (జూన్ 24) భేటీ అవుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ భేటీలో చర్చించే అంశాలేమిటి? తీసుకునే నిర్ణయాలేమిటి? ముఖ్యంగా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి, జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఆయన తొత్తులుగా పని చేసి ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వేధింపులు, దాడులతో చెలరేగిపోయిన అధికారులపై చర్యలకు సంబంధించి చర్చ జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అదే విధంగా లోకోష్ రెడ్ బుక్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించే అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. జగన్ హయాంలో భ్రష్టపట్టిపోయిన వివిధ శాఖల ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాలపై చర్చించి వాటికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, అలాగే నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదు అంశాలకూ కేబినెట్ తొలి భేటీలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటికి అనుగుణంగా బడ్జెట్  రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలవరం, అమరావతిలో పర్యటించారు.  ఇప్పుడు కేబినెట్ భేటీలో  పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని అంటున్నారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.