ఏపీ బేవరేజస్ మాజీ ఎండీకి ముందస్తు బెయిలు నిరాకరించిన హైకోర్టు
Publish Date:Jun 13, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఏపీ సీఐడీ ఇప్పటికే ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన ముందస్తు బెయిలు మంజూరుకు తిరస్కరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ మద్యం కుంభకోణంపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలీలోని నివాసంలో సోదాలు నిర్వహించింది.
http://www.teluguone.com/news/content/ap-bewareges-former-md-anticipatory-bail-rejected-25-178560.html





