22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరయ్యేనా?

Publish Date:Jul 9, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీన్ ప్రసంగిస్తారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీకి సభలో ఆ పార్టీ అధినేత జగన్ తో కలిసి కేవలం 11 మంది సభ్యలు మాత్రమే ఉన్నారు. కాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ వ్యవహరించిన తీరును గమనించిన వారెవరూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయని భావించడం లేదు. 

జగన్ వినతిని మన్నించి సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని చంద్రబాబు ఉదారంగా ఇచ్చారు. అయినా కూడా జగన్  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో కూర్చోకుండానే వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా తనకు సభలో అవమానం జరిగిందన్నట్లుగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా కేవలం 11 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనీ, తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలనీ కోరుతూ  స్పీకర్ కు లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అది వేరే సంగతి కానీ, జగన్ తీరు చూస్తుంటే... సభలో తనకు గౌరవం లభించడం లేదు కనుక హాజరు కాలేనని చెప్పుకోవడానికి ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారని అనుకోవలసి ఉంటుంది.

ఆయన తీరు చూస్తుంటే సభకు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవనే పరిశీలకులు అంటున్నారు. అదీ కాక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన కడప నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే కడప లోక్ సభ స్ధానం నుంచి అవినాష్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలో తాను పోటీ చేయాలని జగన్ భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ఖాళీ చేసిన పులివెందుల స్థానం నుంచి అవినాష్ ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే  అసెంబ్లీ సమావేశాలకు జగన్ డుమ్మా కొట్టేందుకే ఎక్కువ అవకాశాలున్నయన్నది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు.

గతంలో తాను సభానాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విపక్ష సభ్యుల పట్ల ప్రవర్తించిన విధంగానే ఇప్పుడు అధికార పక్ష నేతలు తన పట్ల ప్రవర్తిస్తారన్న భయమే అందుకు కారణమని అంటున్నారు. అయినా అసలు ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను తమ పార్టీ శాసన సభాపక్ష నేతగానే ఎన్నుకోలేదు. అంటే జగన్ కు అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశమేలేదనడానికి ఇదే తార్కానమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి 22 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరౌతారా లేదా?

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.