ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో రోజు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మద్యం కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తుండగా.. తాజాగా లిక్కర్ రవాణా టెండర్ల లోనూ భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే బాధ్యత కోసం నిర్వహించిన టెండర్లలో నిబంధనలను పక్కనపెట్టి ఒక ప్రైవేట్ సంస్థకు భారీ ప్రయోజనం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో బయట పడినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ కాంట్రాక్టులు అప్పగించడం పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈడీ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ఇతర పోటీ సంస్థల కంటే దాదాపు 20 శాతం అధిక ధరలను కోట్ చేసినప్పటికీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టి నట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. సాధారణంగా తక్కువ ధరను కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కాల్సి ఉండగా.. అధిక రేట్లు పేర్కొన్న సంస్థకు కాంట్రాక్టు ఎలా లభించిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
అంతేకాదు.. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు లిక్కర్ రవాణా సేవల పేరుతో ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.349.7 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టు కేటాయింపు వెనుక ఉన్న నిర్ణయాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతుండగా.. ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్టులు కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి రావడం రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలక పరిణామంగా మారింది. ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-sensation-in-the-ap-liquor-scam-36-221716.html
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.