Publish Date:Jun 14, 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అడవి శాఖ సలహాదారుడుగా కొమిర జాజి (అంకారావు) అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. జై జగన్ అన్న లేదని తోట చంద్రయ్య ను వైసిపి నేతలు గొంతు కోసిన విషయం అందరికి తెలిసిందే.. ఇటీవల కొమర జాజి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి.. జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్ట పెట్టడంలో.. కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడుగా 2018లో నియమితులయ్యారు.
అప్పటిలో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు చేతుల మీదగా వినతి పత్రాన్ని పొందారు. ఇప్పటికి కూడా వైసిపి పార్టీకి కొమెర జాజి అనే వ్యక్తి ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ కి రాజీనామా చేయలేదంటూ కూటమి శ్రేణులు బహిరంగనే చెప్పుకుంటున్నారు. వైసీపీకి చెందిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడంతో కూటమి శ్రేణులు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నారు.
కూటమి శ్రేణులు తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో.. నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు పూర్తిగా ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టిడిపి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. కూటమి శ్రేణులు ఎదురుచూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ankarao-25-199954.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.