అనీల్ మళ్లీ మొదలెట్టేశారు!

Publish Date:Jul 1, 2023

Advertisement

వివాదాస్పద వ్యాఖ్యలతో   వార్తల్లో  నిలిచేందుకు  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నానా అగచాట్లూ పడుతున్నారంటూ తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్నది. నెల్లూరు సిటీ  నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు పి. నారాయణను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ( జూన్ 30) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆ స్థానం నుంచి తనను తానే వైసీపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న అనీల్ కుమార్ యాదవ్ సినిమా ఎత్తిపోయినట్లేనని నెల్లూరు వైసీపీ శ్రేణులే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఇప్పటికే పలు వివాదాలతో నిండా మునిగి ఉన్న అనీల్ కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ప్రజాదరణను కోల్పోయారనీ, సొంత పార్టీలోనే ఆయన పట్ల తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోందనీ వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అంతే కాకుండా ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేదంటూ ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేలలో అనీల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అన్న వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ తరువాత ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే వైసీపీ క్యాడర్ మాత్రం ఆయన వెంట నడిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారు. హైదరాబాద్ లో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకుని వార్తల్లోకెక్కిన మరుసటి రోజే నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ నారాయణపై సంచలన ఆరోపణలు చేసి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.  నారాయణ గత కార్పొరేషన్ ఎన్నికలలో  సొంత పార్టీ అయిన తెలుగుదేశం అభ్యర్థులను ఓడించమంటూ తనకు సొమ్ములు పంపారని నిరాధార ఆరోపణలు గుప్పించారు.  అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, నారాయణ పంపిన డబ్బులను వాసస్ చేశాననీ అనీల్ పేర్కొన్నారు. సందర్భం రాకపోవడంతో ఈ విషయాన్ని తాను ఎందుకు ఇంత వరకూ బయటపెట్టలేదన్నారు.

తాను ఇషామాషీగా ఈ ఆరోపణలు చేయలేదనీ, వాటికి కట్టుబడి ఉన్నాననీ, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.  అంతే కాకుండా తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన వారిని మోసం చేయడం అన్నది మాలూలు విషయమేనని  అనీల్ కుమార్ యాదవ్ అన్నారు.  నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే... ఒక వేళ తనకు వైసీపీ టికెట్ వస్తే ఇస్తే ఓటమి తప్పదన్న భయంతోనే  అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడీ ఆరోపణలు చేస్తున్నారని  తెలుగుదేశం నాయకులు అంటున్నారు.  నారాయణపై అనీల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.