ఇకపై ఈ విధాన్ అప్లికేషన్ ద్వారానే ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు!

Publish Date:Nov 26, 2024

Advertisement

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కచ్చితంగా డిజిటల్ లిటరేట్లుగా మారి తీరాలి. ఇప్పటికే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి అయితే ఏం ఇబ్బంది లేదు కానీ, ఆ జ్ణానం లేనివారు డిజిటల్ నాలెడ్జ్ పెంచుకోకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా వారు తడబాటుకు గురి కాక తప్పదు. అన్నిటికీ తమ పీఏలు, పీఎస్ ల మీద ఆధారపడక తప్పదు. అలా అధారపడటం వల్ల జనంలో చులకన కాకా తప్పదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి ఈ విధాన్ అప్లికేషన్ లోనే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి.  కేంద్రం ఇప్పటికే ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ రూపొందించింది.  కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న వారికి ఇబ్బంది లేదు. లేదంటే తన పీఎస్‌లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధార పడాల్సిందే. ఎందుకు అంటే... 
కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఈ– విధాన్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. దీనిని దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా, మండలి అయినా వినియోగించుకోవచ్చు. కానీ అందుకు ఒక నిర్దుష్ట విధానాన్ని అనుసరించాలి. అయితే ఈ విధానాన్ని అనుసరించాలా వద్దా అన్నది ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నిర్ణయం. ఇష్టం ఉంటే ఉపయోగించుకోవచ్చు. లేకుంటే లేదు.  అయితే టెక్నాలజీయే భవిష్యత్ అని విశ్వసించే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ను వినియోగించుకుని పేపర్ లెస్ గా అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరికీ ట్యాబ్ లు అందజేయాలని నిర్ణయించింది.  ఈ ట్యాబ్‌ల ద్వారా ఏదైనా అసెంబ్లీ, శాసన మండలికి సంబంధించిన అన్ని అంశాలూ తెలుసుకునే వీలు కలుగుతుంది.  ప్రశ్నోత్తరాల సమయానికి నోటీసులు ఇవ్వడం, రకరకాల పత్రాలు సమర్పించడం, సభ్యుల నుంచి నోటీసులు స్వీకరించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, కమిటీల నివేదికలు సమర్పించడం, బులిటెన్‌లు జారీ చేయడం వంటివన్నీ ఇకపై డిజిటల్‌ రూపంలోనే జరుగుతాయి. సెక్రటరీ జనరల్‌ తోనూ, మంత్రులైతే తమ శాఖల కార్యదర్శులతోనూ చాటింగ్‌ ద్వారా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల్లో వాడుకోవచ్చు. సభ్యులు ఎప్పుడైనా తమ నోటీసులు సెక్రటరీ జనరల్‌కు పంపొచ్చు. వాటిని శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌కు సెక్రటరీ జనరల్‌ పంపొచ్చు. ఒకే రకమైన ప్రశ్నను చట్ట సభల్లో ఒకరికంటే ఎక్కువ మంది అడిగితే అందరి పేర్లను ఒకే ప్రశ్న వద్ద చేర్చి సమాధానం ఒకటిగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా స్టేషనరీ వృధా అనేదే లేకుండా పోతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కంప్యూటర్‌ శిక్షణ అనివార్యం. ప్రస్తుత ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యుల్లో చాలా మంది బిటెక్‌ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో బిటెక్‌ చదివిన వారైతే పరవాలేదు. పదేళ్లకు ముందు చదువు పూర్తి చేసిన వారైతే మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న వారు ఈ అప్లికేషన్‌ను ఈజీగా హ్యాండిల్‌ చేయగలుగుతారు.  ఆ నాలెడ్జ్ లేని వారు తప్పని సరిగా డిజిటల్ లిటరేట్లు అవ్వడానికి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. దాని కంటే ముందు కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.  ఇదంతా జరగడానికి ముందే  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్ నరులా సమక్షంలో  ఏపీ అ సెంబ్లీ
ఏపీతో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్‌ నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్న కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మండలి చైర్మన్  మోసేనురాజు సమక్షంలో జరిగింది.   సో ఇక ఇప్పడు ఏపీ ఎమ్మెల్యేలు. ఎమ్యెల్సీలు డిజిటల్ లిటరేట్స్ అయ్యేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. 

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.