Publish Date:Oct 18, 2024
ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెజ్ ను వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మొత్తం 2.90లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర విత్త మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ అధికారులంతా బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇందు కోసం మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పయ్యావుల కేశవ్ సంప్రదిస్తున్నారు.
ఎన్నికల దృష్ట్యా గత జగన్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకుంది. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, అప్పుల అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల మరోసారి ఓటాన్ ఎకౌంట్ రూపంలో ఆర్డినెన్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తీసుకున్నది. ఈ మొత్తం కాలంలో, మొత్తం 8 నెలల కాలం ఓటాన్ ఎకౌంట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ నేపథ్యంలో నవంబరు లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమాయత్తమౌతోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు: ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌కు పెద్దపీట వేయనున్నారు. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం సముచిత కేటాయింపులు ఉంటాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-budget-in-november-25-187007.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!