రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్

Publish Date:Nov 10, 2025

Advertisement

 

ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఘట్ కేసర్ ఎన్ఎఫ్‍సీ నగర్‌లో అందెశ్రీ అంతిమ యాత్ర జరగనున్నాది. రేపు సాయంత్రం ఆయన పార్థివదేహాన్నికి ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్న అనంతరం అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. కాగా ఇవాళ ఉదయం  గుండెపోటుతో మరణించిన అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మృతి పట్ల పలవురు ప్రముఖులు, సాహితీ వేత్తలు 
సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు ప్రజాకవి, గాయకుడు అందె ఎల్లయ్య అందెశ్రీగా ఖ్యాతి పొందిన ఆ మహామనిషి. గొర్రెల కాపరిగా, తాపీ మేస్త్రీగా కష్టసుఖాలను అనుభవించిన ఆయన, బాధను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయన జీవితానికి మార్గదర్శకంగా మారాయి. ఆ గీతాలే ఆయనను ప్రజల కవి, పోరాట గాయకుడిగా తీర్చిదిద్దాయి. అవే ఆయనకు ప్రశ్నించే ధైర్యం, సమాజం కోసం పలికే స్వరాన్ని ఇచ్చాయి.

“పల్లెనీకు వందానాలమ్మో”, “సూడా సక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లీ”, “కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు”  ఇలా ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి పాట తెలంగాణ ఆత్మను తాకింది. చివరికి, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రూపంలో ఆయన సాహిత్య ప్రస్థానం చిరస్మరణీయమైంది.

తాపీ మేస్త్రీగా పనిచేసిన అందెశ్రీ చేతులు తెలంగాణ నిర్మాణానికి ఇటుకలు పేర్చినట్లే, ఆయన గళం ఆ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. పశువుల కాపరిగా మందను దారి చూపినట్లే, ప్రజాకవిగా ఆయన తరతరాలను మేల్కొలిపారు. దగాపడిన తెలంగాణ కోసం తన మాటతో, తన పాటతో పోరాడిన ఆ గాయకుని గాధ పల్లెపల్లెల్లో నేటికీ మార్మోగుతోంది. అందెశ్రీ శరీరం లేనప్పటికీ, ఆయన గీతాల గర్జన మాత్రం చిరస్థాయిగా మారింది.
 

By
en-us Political News

  
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది.
అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్
శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల...
దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది.
విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.