కలకలం రేపుతున్న..ఈ స్టాంపుల కుంభకోణం!

Publish Date:Jun 27, 2025

Advertisement

 

అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్సీ ఇన్ఫ్రా వారు తమ అంతర్గత ఆడిటింగ్ లో నకిలీ ఈ స్టాంపులను గుర్తించి అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పోలీసులు వెంటనే మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ కొన్ని  తహసీల్దార్ల నకిలీ రబ్బర్ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీ సేవ బాబు, ఆయన సతీమణి భార్గవి, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. తాజాగా కేసును కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు వారి అరెస్టు చూపితే గానీ పూర్తి వివరాలు అధికారికంగా వెల్ల డయ్యే అవకాశం లేదు. అయితే, ఒక కిలోకు పైగా బంగారు నగలు, 1.2 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ను పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు. 

 కుంభకోణం విలువెంత? 

నకిలీ ఈ స్టాంపుల ద్వారా మీ సేవ బాబు ఎంత మేరకు కుంభకోణం చేశాడనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది...తాము ఒక్కరమే మీసేవ బాబు వద్ద 23 లక్షల రూపాయల విలువ చేసే 467 ఈ స్టాంపులను కొనుగోలు చేశామని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు తెలియజేశారు. దీన్నిబట్టి ఎంత పెద్ద మొత్తంలో మీసేవ బాబు నకిలీ ఈ స్టాంపులను విక్రయించి ఉంటాడో ఊహించుకోవచ్చు. మొత్తం మీద 13వేల నకిలీ ఈ స్టాంపులను మీ సేవ బాబు విక్రయించినట్టు చెబుతు న్నారు. అయితే వాటి విలువ ఎంత అనేది పోలీసుల విచారణలోనే తెలియాల్సి ఉంది.
 
ఎవరీ మీసేవ బాబు? 

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి కి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు. ఇంటర్ వరకు చదువుకున్న ఎర్రప్ప తొలుత కొన్ని దినపత్రికల్లో ఆఫీస్ బాయ్ గా పని చేస్తూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకున్నాడు. 2019 నుంచి మీసేవ కేంద్రం నడుపుతూ వచ్చాడు. 2020లో ఆధార్ సెంటర్ కు అనుమతి తెచ్చుకున్నాడు. అధికారులతో పరిచయాలు పెంచుకుని వారి సహకారంతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసే వాడనే విమర్శలు వచ్చాయి. అయినా, అధికారులెవరూ దృష్టి సారించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో అతను మరింత వేగం పెంచి నకిలీ ఈ స్టాంపుల కుంభకోణానికి సైతం తెర తీశాడు. 

 రాజకీయ పార్టీల పాత్ర ఏమిటి ?

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కు చెందిన ఎస్సార్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు చాలా కాలంగా మీ సేవ బాబు వద్దే ఈ స్టాంపులు కొనుగోలు చేస్తూవచ్చారు. ఈ క్రమంలోనే రూ 900 కోట్ల రుణం కోసం తాజాగా కూడా వారు ఈ స్టాంపులు కొనుగోలు చేశారు. అయితే, అందుకు సంబంధించి స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో పాత్ర ఉంది కాబట్టే వారు ఆ వివరాలు బయటకు వెల్లడించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. మీ సేవ బాబుతో సురేంద్రబాబుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే, వైసీపీ నేతలతో సైతం మీసేవ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీంతో వారు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని 

ఎమ్మెల్యే  సురేంద్రబాబు ఆరోపిస్తున్నారు

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక యూట్యూబర్ గా మీసేవ బాబు తనకు పరిచయమయ్యారన్నారు. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరెవరో చేసే అక్రమాలతో తనకు సంబంధం ఉందని చెప్పడం అర్ధరహితం అన్నారు. తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపును మీడియాకు చూపించారని, కుట్రలో భాగస్వాములు కాకపోతే ఆ పేపరు వారికి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మొత్తం మీద నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం కూడా రాజకీయ రంగు పు లుముకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏసీబీ, సిట్, సిబిఐ వంటి ఏ విచారణ సంస్థతోనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే నిరూపించాలని సురేంద్రబాబు సవాల్ విసిరారు.

By
en-us Political News

  
బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని.. అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.
తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన హీరో విజయ్, ఆయన స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ పరిస్థితి ఏమిటి? తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రభావం ఎంత?
టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
హెచ్‌సీఏ స్కాంలో సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత భర్త.. క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్‌ చర్లపల్లి జైలులో ఉన్నారు.
ఎవ‌రో ఊరూ పేరు లేని జ‌గ‌న్మోహ‌న రావు ఏ క్ల‌బ్ లో మెంబ‌ర్ కూడా కాని జ‌గ‌న్మోహ‌న రావు.. రాజ‌కీయ క్రీడ త‌ప్ప మ‌రే క్రీడా తెలియ‌ని జ‌గ‌న్మోహ‌న రావు.. ఇంత స్థాయికి తిమ్మిని బ‌మ్మిని చేసి ఇక్క‌డి వ‌ర‌కూ ఎలా వ‌చ్చారో మీకు తెలుసా? ఇంతకీ ఈయ‌న మ‌రెవ‌రో కాదు హ‌రీష్ రావు పెద్ద‌మ్మ కొడుక‌ట‌.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్‌ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్లుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడో టెస్టు జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.