అమెరికా దిగ్బంధం డొల్ల.. హర్మూజ్ ను దాటుతున్న ఇరాన్ చమురు ట్యాంకర్లు

Publish Date:Apr 23, 2026

Advertisement

నౌకా దిగ్బంధనం, హర్మూజ్ పై పూర్తి స్థాయి పట్టు అంటూ అమెరికా అధ్యక్షుడు చెబుతున్న మాటలన్నీ డొల్లేనని తేలిపోయింది. హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి పట్టు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తున్న ధీమాకు పూర్తి భిన్నంగా అక్కడి  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి.  ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా విధించిన సముద్ర దిగ్బంధాన్ని ఛేదిస్తూ డజన్ల కొద్దీ ఇరాన్ చమురు ట్యాంకర్లు గల్ఫ్ జలాల గుండా ప్రయాణిస్తున్నట్లు నివేదికలు తేటతెల్లంన్నాయి. అమెరికా నిఘా నేత్రాలను తప్పించుకుని ఇరాన్ సాగిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చిన గత కొద్ది రోజుల్లోనే కనీసం 34 ఇరాన్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం. వీటిలో 19 నౌకలు గల్ఫ్ నుంచి వెలుపలికి, మరో 15 లోపలికి ప్రవేశించాయి. ఈ రవాణా ద్వారా ఇరాన్ దాదాపు 10.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విదేశాలకు తరలించినట్లు అంచనా. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 910 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో   7,600 కోట్ల రూపాయలు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.  

అమెరికా రాడార్ల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్  డొరెనా  వంటి భారీ  ట్యాంకర్లు తమ ఉనికిని చాటే ట్రాన్స్‌పాండర్లను ఆపివేసి ( ప్రయాణిస్తున్నాయి. ఇలా రహస్యంగా జలసంధిని దాటిన తర్వాత..  నడిసముద్రంలో ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును మార్పిడి చేస్తూ, ఆ చమురు ఏ దేశానిదో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాయి. గతంలో అమెరికా బ్లాక్ లిస్టులో ఉన్న నౌకలు కూడా ఇప్పుడు వేరువేరు పేర్లతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. 

 అదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఏ నౌకైనా తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనుమతి తీసుకోవాల్సిందేనని విస్పష్టంగా చెబుతోంది. పౌర విమానాలు, నౌకలకు ప్రత్యేక మార్గాలను కేటాయించిన ఇరాన్..  విదేశీ సైనిక నౌకల కదలికలపై నిఘా ఉంచింది. ఇటీవల భారత, ఫ్రెంచ్ నౌకల సమీపంలో కాల్పులు జరగడం ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రస్తుతం గల్ఫ్ జలాల్లో నెలకొన్న ఈ  డబుల్ బ్లాకేడ్  అంటే.. అమెరికా ఆంక్షలు, ఇరాన్ హెచ్చరికలు అంతర్జాతీయ వాణిజ్యానికి సవాలుగా మారాయి. అమెరికా తన దిగ్బంధం విజయవంతమైందని చెబుతున్నప్పటికీ.. ఆ దిగ్బంధం విఫలమైందని ట్యాంకర్ల రాకపోకలు స్పష్టం చేస్తున్నాయి.  

By
en-us Political News

  
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే.. అతడొక సంపూర్ణ బ్యాటర్ అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు.
ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇలా ఆకస్మికంగా తప్పుకోవడం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల కొన్ని రోజులుగా సుదన్ గురుంగ్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంతో పాటు, మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు బయటపడటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలకు మాత్రమే ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడంతో మధ్యవర్తిత్వం పేరుతో సొంత ప్రయోజనాల లావాదేవీలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ చర్యలు ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పాకిస్థాన్ తీసుకున్న కొన్ని దౌత్యపర చర్యలు ఇరాన్ కు అనుకూలమని కనిపించినా.. వాస్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఉన్న సున్నిత సమతౌల్యాన్ని అవి దారుణంగా దెబ్బతీశాయని అంటున్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అనుమతి షరతులు, పాక్ నౌకలకే ప్రత్యేక అనుమతులు, అలాగే ఇస్లామాబాద్ లో ఇరాన్–అమెరికా చర్చలపై వస్తున్న వార్తలు.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్ దౌత్యం నమ్మకం మీద ఆధారపడినదిగా కాకుండా, లావాదేవీల మీద ఆధారపడినదిగా మార్చేశాయి.
కోరుకొడ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాండవుల మెట్టపై పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారుల ప్రకటనతో ఒక్కసారిగా ఆప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు.
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ​సుప్రీంకోర్టు ఆదేశించినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్ యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ​సాక్షులను బెదిరిస్తూ,డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు.
డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన విజ్ణప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు.
160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది.
నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.
అసెంబ్లీ ఎన్నికల సమరం.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఈవీఎంలు, భద్రత కట్టుదిట్టం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.