Publish Date:Aug 26, 2025
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదన్న ఒకే ఒక్క కారణంతో.. అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. ఇంకొన్ని గంటల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్.. భారత్‌కు అధికారికంగా నోటీసులు పంపింది. ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచి.. ఈ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టైమ్ దాటిన తర్వాత నుంచి.. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుత్తం అదే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.
భారత్‌పై ఇప్పటికే.. అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి.. అమల్లోకి వచ్చాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో.. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ప్రెసిడెంట్ ట్రంప్. దాంతో కలిపి.. ఇండియాపై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. టెక్స్‌టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే.. ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే.. ఈ అదనపు టారిఫ్‌లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో.. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు.. ప్రధాని మోడీ కూడా ఈ సుంకాల విషయంలో స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో.. రాడీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెరిగినా.. భరిస్తామని స్పష్టం చేశారు.
ఈ అదనపు సుంకాల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దానిని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి - ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు.
సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైనా చర్చించారు. 50 శాతం సుంకాలు.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలున్నాయి. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/america-tariffs-from-tomorrow-39-205067.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.